రాజమహేంద్రవరం సిటీ, జనవరి 28: రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట జైహింద్‌నగర్‌కు చెందిన తన భర్త గంగాధర్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని అతడిపై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ప్రియాంక బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019లో గంగాధర్, తానూ ప్రేమించి వివాహం చేసుకున్నామని, ఇప్పుడు తనను వదిలించుకుని మరో వివాహానికి సిద్ధమయ్యాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై అతడ్ని నిలదీయగా తన కులాన్ని తక్కువ చేసి అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.