Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్య ఆత్మహత్య చేసుకుందని తెలిసి.. భర్త షాకింగ్ నిర్ణయం.. చివరికి కుటుంమే బలి

చిన్న గొడవ కారణంగా ఒక కుటుంబమంతా ఛిన్నాభిన్నమైంది. ప్రేమానురాగాలతో ఉండాల్సిన బంధాలు యమపాశాలుగా మారాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం లేకపోవడంతో చివరికి ప్రాణాలే కోల్పాయారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఎందుకు ఉండకూడదో.. పిల్లలను ప్రేమగా చూసుకోకుంటే ఏమౌతుందో గుజరాత్‌లోని ఒక విషాద ఘటన నిదర్శనంగా నిలిచింది.


గుజరాత్‌లోని సూరత్ నగరంలో నివసించే సంజయ్(35) వజ్రాలకు సంబంధించిన వ‌ృత్తిలో ఉన్నాడు. ఆయనకు జియా(7) ఒక కూతురు ఉంది. సంజయ్ 2018లో జియా తల్లి నుంచి విడాకులు తీసుకున్నాడు.  కొద్ది కాలం తరువాత మళ్లీ రేఖాబేన్(32)ని రెండో వివాహం చేసుకున్నాడు. రేఖాబేన్‌కి కూడా అది రెండో వివాహమే. ఆమె మెదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. రేఖాబేన్‌కి మొదటి భర్త నుంచి ఒక కొడుకు ఉన్నాడు. అతను నాన్న వద్దే ఉంటాడు.


రేఖాబేన్‌తో సంజయ్‌ వివాహం చేసుకున్న కొద్దికాలానికే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు.. రేఖాబేన్ చిన్నారి జియాను తరుచూ కొట్టేది. ఈ విషయం జియా ఏడుస్తూ తండ్రికి చెప్పింది. కారణం లేకుండా పాపను ఎందుకు కొడుతున్నావ్? అని అడిగితే.. జియాను హాస్టల్‌కు పంపించమని రేఖాబేన్ చెప్పేది. కానీ జియా అంటే సంజయ్‌కి ప్రాణం. తన పాపను వదిలి ఉండలేనని సంజయ్ అన్నాడు. సవతి తల్లిగా కాకుండా ఒక తల్లిగా జియాను ప్రేమగా చూసుకోమని సర్ది చెప్పాడు. ఆమె కూడా ఒక కొడుకు తల్లి అని గుర్తు చేశాడు. సమయం గడిచే కొద్దీ భార్యలో మార్పు వస్తుందని ఆశించాడు.


కానీ రేఖాబేన్ ప్రవర్తనలో ఏ మార్పూ రాలేదు. పనిమీద ఇంటి నుంచి సంజయ్ బయటికి వెళ్లినప్పుడు జియాను తన శత్రువుగా చూసేది. ఆ చిన్నారిని చితకబాదేది. ఒక రోజు సంజయ్ ఇంటికి రాగానే జియాను ఎత్తుకొని ఆడించడానికి వెళ్లాడు అప్పుడు జియా ముఖం ఎర్రగా ఉండడం చూసి.. ఏం జరిగిందని అడిగాడు. మమ్మీ కొట్టిందని.. జియా చెప్పగా.. ఈ సారి సంజయ్ సహనం నశించింది. రేఖాబేన్‌ని నిలదీశాడు. దీంతో రేఖాబేన్ కూడా రెచ్చిపోయింది. ఇంట్లో జియా కావాలో.. లేక తాను కావాలో తేల్చుకోమంది. అప్పుడు సంజయ్ కోపంతో.. "నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు.. అందుకే నీ కొడుకు కూడా నీతో లేడు.. ఈ ఇల్లు కాదు.. ఈ లోకమే వదిలివెళ్లిపో" అని అన్నాడు. 


సంజయ్ అన్న మాటలకు మనస్తాపం చెందిన రేఖాబేన్ విషం తాగి చనిపోయింది. దీంతో పోలీసులు సంజయ్‌ని అరెస్టు చేశారు. ఆ తరువాత సంజయ్ బెయిలుపై బయట వచ్చినా పోలీసుల చిత్రహింసలు మాత్రం ఆగలేదు. మరోవైపు తను కోపంలో అన్న మాటల వల్ల తన భార్య ఆత్మహత్య చేసుకుందని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అలా ఒకరోజు తన కూతురు జియాను తీసుకొనివెళ్లి నది ఒడ్డున కూర్చొని ఏడ్చాడు. తన కూతురిని కౌగిలించుకొని ఆ నదిలో దూకేశాడు. పక్కనే ఉన్న చేపలు పట్టే వారు ఇది గమనించి. వారిద్దరినీ బయటకు తీశారు. కానీ జియా ప్రాణాలు అప్పటికే గాలిలో కలిసిపోయాయి. ప్రస్తుతం సంజయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement