Abn logo
Feb 26 2021 @ 02:56AM

భర్త ‘బీమా’ కోసం భార్య ఆత్మహత్యాయత్నం

కాపాడిన పోలీసులు 


తాండూరు రూరల్‌, ఫిబ్రవరి 25 : భర్త చనిపోగా రైతు బీమా డబ్బులు రూ.5 లక్షలు రాకపోవడంతో భార్య ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు వ్యవసాయ కార్యాలయం వద్ద గురువారం జరిగింది. తాండూరు మండలం చెంగోల్‌ గ్రామానికి చెందిన రైతు చెన్నారం నర్సింహులు ఈ ఏడాది జనవరి 30న చనిపోయాడు. గురువారం తాండూరు వ్యవసాయ కార్యాలయంలో ఏఈవో ఫరీనా వద్దకు వెళ్లి బీమా డబ్బుల విషయం అడిగింది.


నర్సింహులు పేరిట రైతు బీమా ధ్రువీకరణ పత్రాలు లేవని, అందుకే బీమా డబ్బులు రాలేవని ఆమె తెలిపింది. తన భర్త భూమికి సంబంధించిన ధృవపత్రాలు అన్ని అందించానని, అయినా ఎన్‌రోల్‌ కాలేదని చెప్పి తనను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారంటూ అనసూజ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకునే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఐదు గంటలపాటు  అనసూజ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు సముదాయించడంతో వెళ్లిపోయింది. ఈ విషయమై ఏఈవో ఫరీనా మాట్లాడుతూ నర్సింహులుకు భూమి ఉ న్నా తన పేరిట బీమా చేసుకోలేదని తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement