ఫ్రెండ్స్‌‌ను కలిసి వస్తానన్న భర్త.. అనుమానంతో స్కూటీపై ఫాలో అయిన భార్యకు కారులో కనిపించిన సీన్ చూసి..!

ABN , First Publish Date - 2022-04-20T20:53:50+05:30 IST

అతను ఓ కానిస్టేబుల్.. స్నేహితులతో గడిపి వస్తానని చెప్పి తరచుగా బయటకు వెళ్తుండేవాడు..

ఫ్రెండ్స్‌‌ను కలిసి వస్తానన్న భర్త.. అనుమానంతో స్కూటీపై ఫాలో అయిన భార్యకు కారులో కనిపించిన సీన్ చూసి..!

అతను ఓ కానిస్టేబుల్.. స్నేహితులను కలిసి వస్తానని చెప్పి తరచుగా బయటకు వెళ్తుండేవాడు.. అతనిపై భార్యకు అనుమానం వచ్చింది.. స్నేహితుల పేరు చెప్పి ప్రియురాలి దగ్గరకు వెళ్తున్నాడేమోనని అనుమానించడం ప్రారంభించింది.. శనివారం సాయంత్రం కూడా ఎప్పటిలాగానే భర్త బయటకు వెళ్లాడు.. అతనిని భార్య స్కూటీపై రహస్యంగా ఫాలో అయింది.. ఆమె అనుమానం నిజం అయింది.. భర్త వేరొక మహిళతో వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.. రోడ్డుపైనే ఇద్దరికీ చుక్కలు చూపించింది. 


రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌‌కు చెందిన సురేంద్ర కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సురేంద్ర చాలా కాలంగా ఓ మహిళతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. భార్యకు తెలియకుండా ఆమెను తరచుగా కలుస్తున్నాడు. స్నేహితుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి ప్రియురాలితో తరచుగా టూర్లకు వెళుతుండేవాడు. గత నెలలో ఐదు రోజుల టూర్ అని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో సురేంద్ర భార్యకు అనుమానం మొదలైంది. శనివారం సాయంత్రం కూడా సురేంద్ర ఎప్పటిలాగానే ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లాడు. 


సురేంద్ర భార్య అతడిని స్కూటీపై రహస్యంగా అనుసరించింది. భర్త వేరొక మహిళను కారులో ఎక్కించుకుని వెళ్తుండడాన్ని చూసింది. రోడ్డుపై కారు ఆపి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్త ప్రియురాలిని చెప్పుతో కొట్టింది. రోడ్డుపై సుమారు 30 నిమిషాల పాటు భర్త, అతని ప్రియురాలిపై దాడి చేసింది. అక్కడ ఉన్నవారు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె ఎవరి మాటా వినలేదు. చివరకు కుటుంబ సభ్యులు రావడంతో ఆమె శాంతించి ఇంటికి వెళ్లిపోయింది. ఈ విషయంపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 

Updated Date - 2022-04-20T20:53:50+05:30 IST