Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 14 Sep 2021 15:54:08 IST

పరువు పోతోంది.. పద్ధతి మార్చుకోమన్న భర్త.. పెట్రోల్ పోసి నిప్పంటించినా చావకపోవడంతో ప్రియుడితో కలిసి ఆ భార్య..

twitter-iconwatsapp-iconfb-icon

ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.. కూలి పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలనూ చదివిస్తున్నారు.. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది.. భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఆ విషయం తెలిసి భర్త ఆమెను హెచ్చరించాడు.. పద్ధతి మార్చుకోమని ఎన్నోసార్లు చెప్పాడు.. అయినా ఆమె మారకపోవడంతో ఆదివారం వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.. దీంతో భర్తపై భార్య పెట్రోల్ పోసి నిప్పింటించింది.. కర్ణాటకలోని తుమకూరులో ఈ ఘటన జరిగింది. 


తుమకూరుకు సమీపంలోని బద్దిహల్లి ప్రాంతంలో నివసిస్తున్న నారాయణప్ప ఓ ప్రైవేట్ కంపెనీలో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. అతడి భార్య అన్నపూర్ణ వేరే కంపెనీలో రోజు కూలీగా పనిచేస్తోంది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. కాగా, అన్నపూర్ణ తనతోపాటు పనిచేసే రామకృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న నారయణప్ప భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె వినలేదు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న అన్నపూర్ణ, రామకృష్ణను చూసి నారాయణప్ప ఆగ్రహానికి గురయ్యాడు. 


ఇవి కూడా చదవండి

ఫోన్లో బొమ్మల వీడియోలు పెట్టి రెండేళ్ల కొడుక్కి ఇచ్చి స్నానానికి వెళ్లిందా తల్లి.. తిరిగొచ్చేసరికి జరిగిన దారుణమిది..!





17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్.. పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత కూడా అదృశ్యం.. అసలు కథేంటో తెలిసి అంతా షాక్..!

భార్యతో వాగ్వాదానికి దిగాడు. గొడవ పెద్దది కావడంతో ఆగ్రహం పట్టలేకపోయిన అన్నపూర్ణ ఇంట్లో ఉన్న పెట్రోల్ తీసి భర్తపై వేసి నిప్పంటించింది. ప్రాణాపాయంతో బయటకు పరిగెత్తిన నారాయణప్ప డ్రైనేజ్‌లోకి దూకి మంటలను ఆర్పుకున్నాడు. ఆ సమయంలో అన్నపూర్ణ ప్రియుడు రామకృష్ణ బయటకు వచ్చి పెద్ద రాయి తీసి నారాయణప్ప తలపై విసిరేశాడు. దీంతో నారాయణప్ప అక్కడికక్కడే చనిపోయాడు. ఇదంతా పట్టపగలు నడిరోడ్డు మీద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణను, రామకృష్ణను అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలంలో ఉన్న అన్నపూర్ణ, నారాయణప్ప పెద్ద కూతురుని సాక్షుల జాబితాలో చేర్చారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.