Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిద్రిస్తున్న‌ భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య

సంసారంలో సమస్యలు తలెత్తినప్పుడు భార్యభర్తలు కలిసి మాట్లాడుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలే గానీ గొడవల వరకూ తీసుకెళ్లకూడదు. కానీ కొన్ని కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని చివరకు విడిపోయే వరకూ తీసుకొస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి కేసులు పెరిగిపోయాయి. గొడవను పెద్దది చేసుకోవడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఒక్కోసారి క్షణికావేశంలో చంపుకోవడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. చట్టాలు ఎన్ని వచ్చినా మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా ఏపీలో ఇలాంటి దారుణమే జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో భార్యాభర్తలు కుటుంబ సమస్యలపై తరచూ గొడవపడేవారు. ఇటీవల గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 15న కూడా ఇద్దరూ గొడవపడ్డారు. భర్త ఆగ్రహానికి గురై దుర్భాషలాడాడు. అనంతరం అతను వెళ్లి పడుకున్నాడు. అయితే భర్తపై కోపం పెంచుకున్న భార్య.. అదే తలచుకుంటూ ఉంది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై బాగా మరిగిన వేడి నీటిని పోసింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్ సీఐ ఆది ప్రసాద్, ఎస్సై కిషోర్ బాబు విచారణ చేపట్టారు. బాధితుడు ఏలూరు పత్తే బాధ సెంటర్‌లో టైలర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement