హైదరాబాద్: నగరంలోని రామంతపూర్ శ్రీనగర్ కాలనీలో భార్య భర్తల సూసైడ్ కలకలం రేపుతోంది. స్థానికంగా ఉండే సాయి గౌడ్, నవనీత ఐదు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకొని శ్రీనగర్ కాలనిలో నివాసం ఉంటున్నారు. కాగా గత రాత్రి దంపతులిద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త ఉరివేసుకోగా, భార్య విషం సేవించి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి