Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్వచ్ఛ నెల్లూరుపై విస్తృత ప్రచారం : కమిషనర్‌

నెల్లూరు(సిటీ), నవంబరు 27 : నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యాన్ని తెలుపుతూ విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్‌ఎంసీ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. శనివారం తన కార్యాలయంలో ఇంజనీరింగ్‌, పారిశుధ్య విభాగాలతో ఆయన సమీక్షించారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ నెల్లూరులో డస్ట్‌ బిన్‌ రహితంగా తయారు చేయడంతో ప్రజలందరూ ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలన్నారు. స్వచ్ఛ నెల్లూరు పై ఎక్కడిక్కడ సచివాలయాల వారీగా అధికారులు, సిబ్బంది విస్తృతంగా ప్రచారం, అవగాహన నిర్వహించాలని సూచించారు. దేశంలో టాప్‌ 20 ర్యాంకుల్లో మనం కచ్చితంగా ఉండేలా కృషి చేయాలని తెలిపారు. పర్యావరణ, పరిరక్షణలో భాగంగా ప్రతి పౌరుడూ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిలువరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సంపత్‌కుమార్‌, ఎంహెచ్‌ వో వెంకటరమణయ్యలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement