Advertisement
Advertisement
Abn logo
Advertisement

2022 టీ20 ప్రపంచకప్ సూపర్ 12 నుంచి ఈ రెండు జట్లు అవుట్!

యూఏఈ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో విండీస్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన తర్వాత వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ సూపర్ 12 క్వాలిఫయర్స్ జాబితా రెడీ అయిపోయింది. ఈ ఏడాది సూపర్ 12 ఆడిన 12 జట్లలో 8 నేరుగా 2022 టీ20 ప్రపంచకప్ సూపర్ 12కు అర్హత సాధించాయి. వీటిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి.


ఈ టోర్నీలో చెత్తగా ఆడిన శ్రీలంక, విండీస్ జట్లు సూపర్ 12కు అర్హత కోల్పోయాయి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇవి వరుసగా 9, 10 స్థానాల్లో నిలిచాయి. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఇవి రెండూ సూపర్ 12లో ప్రవేశించాలంటే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.


తాజా ప్రపంచకప్‌ సూపర్ 12లో బంగ్లాదేశ్ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడినప్పటికీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై సొంతగడ్డపై సాధించిన విజయాలు ఆ జట్టుకు 8వ ర్యాంకును కట్టబెట్టాయి. ఫలితంగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ సూపర్ 12కు ఆ జట్టు నేరుగా అర్హత సాధించింది.


ఏడో స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్థాన్ కూడా నేరుగా అర్హత సాధించింది. ఈసారి సూపర్ 12లోకి దూసుకొచ్చిన స్కాట్లాండ్, నమీబియా జట్లు కూడా వచ్చే ఏడాది విండీస్, శ్రీలంకతో కలిసి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement