నీటిని తాగాక బాటిల్‌ను డ్యామేజ్ చేయాలని ఆ కంపెనీలు ఎందుకు చెబుతాయో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-14T16:17:00+05:30 IST

మీరు బయట ప్రయాణాలు సాగించేటప్పుడు..

నీటిని తాగాక బాటిల్‌ను డ్యామేజ్ చేయాలని ఆ కంపెనీలు ఎందుకు చెబుతాయో తెలుసా?

మీరు బయట ప్రయాణాలు సాగించేటప్పుడు వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటారు. ఆ బాటిల్‌పై.. వాటర్ మొత్తం తాగేశాక దానిని డ్యామేజ్ చేయండి.. అని రాసివుంటుంది. సంబంధిత వాటర్ బాటిల్ కంపెనీలు బాటిల్‌పై ఇలా రాయడానికి గల కారణమేమిటో మీకు తెలుసా? నీరు తాగిన తర్వాత ఆ బాటిల్‌ను ధ్వంసం చేయాలని సూచించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఇన్ఫెక్షన్ ముప్పు.. ఒక వాటర్ బాటిల్‌లో 9 లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయని ఒక పరిశోధనలో తేలింది. వాటిలోని 60 శాతం బ్యాక్టీరియాలు మనిషిని అనారోగ్యానికి గురిచేస్తాయని తేలింది. 


అందుకే వాటిని తిరిగి ఉపయోగించకుండా ధ్వంసం చేయాలని సదరు కంపెనీలు సలహా ఇస్తుంటాయి. దీని వెనుక మరో కారణం కూడా ఉంది. ఈ బాటిళ్లలో నీటిని నింపి.. వాటిని సరఫరా చేసే అవకాశం కూడా ఉంది. ఈ ప్రక్రియ కారణంగా వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అందుకే ఒకసారి వినియోగించిన తరువాత ఆ బాటిళ్లను పాడుచేయాలని కంపెనీలు సూచిస్తుంటాయి. ఇందుకోసం మీకు దగ్గరిలో బాటిళ్ల రీసైక్లింగ్ వ్యవస్థ ఉంటే అక్కడ వాటిని అందజేయవచ్చు.  ఇండోనేషియా వంటి దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేసే స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి. ప్లాస్టిక్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అందుకే ప్యాక్ చేసిన బాటిల్‌ను ఒక్కసారి మాత్రమే ఉపయోగించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తుంటారు.

Updated Date - 2022-01-14T16:17:00+05:30 IST