Hindi భాష ఉద్యోగాలు ఇస్తే.. వారు Paani Puri ఎందుకమ్ముతారు?: TN మంత్రి

ABN , First Publish Date - 2022-05-13T21:59:50+05:30 IST

హిందీ వివాదంపై సినిమా ఇండస్ట్రీలోనూ వివాదం చెలరేగింది. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ కౌంటర్ ఇవ్వడం.. అజయ్ కామెంట్స్‌ని తప్పుపడుతూ అనేక విమర్శలు..

Hindi భాష ఉద్యోగాలు ఇస్తే.. వారు Paani Puri ఎందుకమ్ముతారు?: TN మంత్రి

చెన్నై: హిందీయేతర రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలోనే మాట్లాడుకోవాలంటూ కేంద్ర హోంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ దుమారం రేగుతూనే ఉంది. అందరికి తెలిసినట్లుగానే తమిళనాడు నుంచి ఈ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వచ్చింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడే అమిత్ షా వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. తమ రాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తేల్చి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తు చేస్తూ హెచ్చరికలు చేశారు. కాగా, తాజాగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ కే పొన్ముడి ఈ విషయమై స్పందిస్తూ సెటైర్లు వేశారు. హిందీ భాష మరిన్ని ఉద్యోగాలు కల్పించేదే అయితే వాళ్లు (ఉత్తర భారతదేశం వారు) పాని పూరి ఎందుకు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన భారతియార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


హిందీ వివాదంపై సినిమా ఇండస్ట్రీలోనూ వివాదం చెలరేగింది. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ కౌంటర్ ఇవ్వడం.. అజయ్ కామెంట్స్‌ని తప్పుపడుతూ అనేక విమర్శలు వచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి సహా సీనియర్ నేతలంతా సుదీప్‌కు మద్దతుగా నిలిచారు. ఈ విషయమై బీజేపీ కాస్త వెనకడుగు వేసినప్పటికీ దక్షిణాదిలో ఎవరో ఒకరు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Read more