అప్లికేషన్స్‌ ఎందుకలా?

ABN , First Publish Date - 2020-03-07T07:47:09+05:30 IST

నా కంప్యూటర్లో ఏదైనా అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేయడానికి ప్రయత్నిస్తే ఇన్‌స్టలేషన్‌ డైరెక్టరీ మస్ట్‌ బి ఆన్‌ ఎ లోకల్‌ డ్రైవ్‌ అని వార్నింగ్‌ మెసేజ్‌ చూపించి ఆగిపోతోంది. దీంతో ఎలాంటి అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేయటానికి సాధ్యపడటం లేదు. ఎందుకిలా జరుగుతోంది.

- శ్రీనివాస్‌

ఏదైనా అప్లికేషన్‌ మన కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లన్నీ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో ఉండే టెంపరరీ ఫోల్డర్‌లోకి వెలికి తీయబడుతూ ఉంటాయి. ఒకవేళ ప్రస్తుతం మీరు అడ్మినిస్ట్రేటర్‌ యూజర్‌ అకౌంట్‌ హోదా కలిగి లేకపోయినా, లేదా కాన్ఫిగరేషన్‌ సమస్యల వలన టెంప్‌ ఫోల్డర్‌లో  మార్పులు చేసే హోదా మీ యూజర్‌ అకౌంట్‌కి లేకపోయినా  ఇలాంటి ఎర్రర్‌ మెసేజ్‌ వస్తుంది.  దీనికి చాలా సులభమైన పరిష్కారం ఉంది.  కమాండ్‌ ప్రామ్ట్‌ గానీ, పవర్‌షెల్‌ని గానీ అడ్మినిస్ట్రేటర్‌ హోదాలో ఓపెన్‌ చేసి,  మీరు ఇన్‌స్టాల్‌ చేయాలనుకుంటున్న అప్లికేషన్‌ ఏ డైరెక్టరీలో ఉందో దానిలోకి  కమాండ్‌ ప్రామ్ట్‌ ద్వారా వెళ్లి  అక్కడనుండి సెటప్‌ ఫైల్‌ని రన్‌ చేయండి. ఇప్పుడు కచ్చితంగా ఎలాంటి ఎర్రర్‌ మెసేజ్‌ లేకుండా ఇన్‌స్టాల్‌ అవుతుంది. కొన్నిసార్లు సెటప్‌ ఫైల్‌ మీద  రైట్‌ క్లిక్‌ చేసి రన్‌ యాజ్‌ అడ్మినిస్ట్రేటర్‌ అనే ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నా ఆ అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. 

మీ టెక్‌ సందేహాలకు సమాధానాల కోసం : navya@andhrajyothy.com

Updated Date - 2020-03-07T07:47:09+05:30 IST