world rose day 2022: క్యాన్సర్ పేషెంట్స్ కు ఈ రోజును ఎందుకు అంకితమిచ్చారు..! ఈరోజును ఏలా జరుపుకుంటారు..?

ABN , First Publish Date - 2022-09-22T20:42:38+05:30 IST

క్యాన్సర్ వ్యాధి గ్రస్థులకు, వారికి సేవచేసేవారికి ఈ రోజును అంకితమిస్తూ, రోగుల జీవితంలో ఆనందం తీసుకురావడానికి ఈ గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

world rose day 2022: క్యాన్సర్ పేషెంట్స్ కు ఈ రోజును ఎందుకు అంకితమిచ్చారు..! ఈరోజును ఏలా జరుపుకుంటారు..?

క్యాన్సర్ వ్యాధి గ్రస్థులకు, వారికి సేవచేసేవారికి ఈ రోజును అంకితమిస్తూ, రోగుల జీవితంలో ఆనందం తీసుకురావడానికి ఈ గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 


ప్రతి సంవత్సరం, సెప్టెంబర్ 22 క్యాన్సర్ రోగులకు, వారిని చూసుకునే వ్యక్తులకు అంకితం చేయబడింది. 12 ఏళ్ల కెనడియన్ క్యాన్సర్ బాధితురాలు మెలిండా రోజ్ తన జీవితంలోని చివరి 6 నెలలను తన చుట్టూ ఉన్న క్యాన్సర్ రోగుల జీవితంలో ఆనందం, ఆశను తీసుకురావడానికి అంకితం చేసిన జ్ఞాపకార్థంగా ఈ రోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆమె 1996లో మరణించింది.


ప్రపంచ గులాబీ దినోత్సవం ప్రాముఖ్యత..

'వరల్డ్ రోజ్ డే' అనే పేరు లిండా ఇంటిపేరు నుండి తీసుకున్నారు. ఆమె అస్కిన్స్ ట్యూమర్‌తో బాధపడింది, ఇది చాలా అరుదైన రక్త క్యాన్సర్. ఈ రకమైన క్యాన్సర్‌లో, బ్రతికే చాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. తన తోటి రోగులకు ఏదో చేయాలన్న ఆమె తపన ఆమెను 6 నెలలు మాత్రమే జీవించేలా చేసింది. తను రోగులకు సాయపడాలని నిర్ణయించుకున్నాకా.. చాలా ఆనందంగా ఉండటం చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తనలాంటి వారికి ఆనందాన్ని పంచాలనే కోరిక మెలిండాను బ్రతికిస్తున్నందుకు చాలా సంతోషించారు. ఇది మాత్రమే కాదు, మెలిండా క్యాన్సర్ రోగులకు స్ఫూర్తిదాయకమైన ఉత్తరాలు ఇమెయిల్‌లు, కవితలు రాసి రోగులలో సంతోషాన్ని, స్పూర్తిని నింపేది.


ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు?

ఈ రోజును క్యాన్సర్ రోగులలో ఆనందాన్ని నింపడానికి ప్రయత్నిస్తారు. నొప్పిని తగ్గించడానికి గులాబీలు, ఇతర బహుమతులు, వస్తువులను ఇస్తారు. ఇంకొందరు రకరకాల సందేశాలను, కోట్స్, పద్యాలు, పాటలు, నృత్య ప్రదర్శనలు మొదలైన వాటితో రోగులకు చికిత్స చేయడానికి వారి ముఖాలలో ఆనందాన్ని నింపడానికి ప్రయత్నిస్తారు. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడడంలో ఒంటరిగా లేమని వారికి భరోసాను అందిస్తూ ప్రోత్సహించడమే ఈ ఆలోచన ప్రధాన ఉద్దేశ్యం. 


మీరు ఈ వరల్డ్ రోజ్ డే 2022ని ఎలా గడపవచ్చు:

క్యాన్సర్ రోగులతో మాట్లాడటం, వారిని కలవడం, సహాయపడటం ద్వారా ఈరోజును వారితో గడపవచ్చు. క్యాన్సర్ అవగాహన ప్రచారాలలో కూడా పాల్గొనవచ్చు. క్యాన్సర్ గురించి దానిని ఎలా నయం చేయాలో ఇతరులకు తెలియచెప్పవచ్చు.

Updated Date - 2022-09-22T20:42:38+05:30 IST