సాధ్యం కాని బడి ఎందుకు ప్రారంభించారు?

ABN , First Publish Date - 2022-08-07T06:15:23+05:30 IST

ఇంగ్లీష్‌ మీడియం బడిని ప్రారంభిస్తామని చెప్పడం తో సంతోషించాం.

సాధ్యం కాని బడి ఎందుకు ప్రారంభించారు?
నిరసన తెలుపుతున్న పోషకులు

వెంగ్వాపేట్‌ గ్రామస్థుల ఆందోళన 

నిర్మల్‌అర్బన్‌, ఆగస్టు 6 : ఇంగ్లీష్‌ మీడియం బడిని ప్రారంభిస్తామని చెప్పడం తో సంతోషించాం. కానీ అస లే ఉపాధ్యాయులు బడికి రాకపోతే ఎలా సాధ్యమవుతుందని నిర్మల్‌ మండలం వెంగ్వాపేట్‌ గ్రామస్థులు నిలదీశారు. శనివారం గ్రామాభివృద్ది కమిటీ పెద్దలు, విద్యాకమిటీ చైర్మన్‌ అశోక్‌ ఆధ్వర్యంలో పాఠశాలకు వెళ్లి ఆందోళన చేపట్టారు. విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నా రు. ఉన్న ఇద్దరు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామ అభివృద్ది కమిటీ నిధులతో విద్యా వాలింటీర్‌ను నియమించి తమ గ్రామ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తుంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు బడిని సక్రమంగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌, డీఈవోను కలిసి ఫిర్యాదు చేస్తామని విద్యాకమిటీ చైర్మన్‌ అశోక్‌ తెలిపారు. 

Updated Date - 2022-08-07T06:15:23+05:30 IST