భారతదేశం మ్యాప్‌లో పాకిస్తాన్‌, చైనా కనిపించవు.. కానీ శ్రీలంక ఎందుకు కనిపిస్తుంది? దీనికి కారణం ఏమిటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-06T14:15:45+05:30 IST

మీరు భారతదేశం మ్యాప్‌ను పరిశీలనగా చూసినప్పుడు..

భారతదేశం మ్యాప్‌లో పాకిస్తాన్‌, చైనా కనిపించవు.. కానీ శ్రీలంక ఎందుకు కనిపిస్తుంది? దీనికి కారణం ఏమిటో తెలిస్తే..

ఇండియా మ్యాప్‌ని చూసినప్పుడు దానిలో శ్రీలంక కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్, భూటాన్, చైనా మొదలైన దేశాలు కనిపించవు. ఎందుకు ఇలా ఉంటుందోనని ఎప్పుడైనా ఆలోచించారా?

మీరు భారతదేశం మ్యాప్‌ను పరిశీలనగా చూసినప్పుడు శ్రీలంక దానిలో కనిపిస్తుంది. మరే పొరుగుదేశం కూడా కనిపించదు. భారత మ్యాప్‌లో శ్రీలంక తప్ప ఇతర దేశాలు కనిపించవు. దీని అర్థం శ్రీలంకతో మనకు సత్సంబంధాలు ఉన్నాయని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. భారత్ మ్యాపులో శ్రీలంక కనిపించడం వెనుక సముద్రం చట్టం కారణంగా నిలిచింది. దీనినే ఓషన్ లా అని అంటారు. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం తరువాతనే ఈ చట్టం ఉనికిలోకి వచ్చింది. ఈ చట్టాన్ని రూపొందించడానికి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యూఎన్సీఎల్ఓసీ-1) కాన్ఫరెన్స్‌ను మొదటిసారిగా 1956 సంవత్సరంలో నిర్వహించారు. 1958 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఈ యూఎన్సీఎల్ఓసీ-1లో సముద్రానికి సంబంధించిన సరిహద్దులు, ఒప్పందాలకు సంబంధించి ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది. అనంతరం 1982 వరకు మూడు సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో సముద్రానికి సంబంధించిన చట్టాలను గుర్తించే ప్రక్రియ జరిగింది.


సముద్ర చట్టం అంటే ఏమిటి?

చట్టాన్ని రూపొందించినప్పుడు, భారతదేశం మ్యాప్‌లో బేస్ లైన్ నుండి 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉండే ప్రదేశాన్ని.. అంటే ఆ దేశపు బేస్ లైన్‌ను చూపించడం తప్పనిసరని నిర్ణయించారు. దీని ప్రకారం ఒక దేశం సముద్ర తీరంలో ఉన్నట్లయితే లేదా దానిలో కొంత భాగం సముద్రానికి అనుసంధానమై ఉంటే, అటువంటప్పుడు ఆ దేశ సరిహద్దు చుట్టూ ఉన్న ప్రాంతం కూడా ఆ దేశ మ్యాప్‌లో చూపిస్తారు. భారత మ్యాప్‌లో శ్రీలంకను చూపించడానికి కారణం ఇదే. ఎందుకంటే శ్రీలంక.. భారత్‌కు 200 నాటికల్ మైళ్లలోపే ఉంటుంది. భారతదేశ సరిహద్దు నుంచి 200 నాటికల్ మైళ్ల దూరంలో వచ్చే అన్ని ప్రదేశాలు మ్యాప్‌లో చూపించారు. భారతదేశం నుంచి శ్రీలంకకు గల దూరం గురించి మాట్లాడుకోవాల్సివస్తే.. భారతదేశంలోని ధనుష్కోడి నుంచి శ్రీలంక కేవలం 18 మైళ్ల దూరంలోనే ఉంది. అందుకే భారతదేశం మ్యాప్‌లో శ్రీలంక ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది.



Updated Date - 2022-01-06T14:15:45+05:30 IST