అన్నం తిన్న తర్వాత స్నానం చేయొద్దని పెద్దలు ఎందుకంటారు..? అలా చేస్తే ఏమవుతుంది..?

ABN , First Publish Date - 2021-12-16T23:11:19+05:30 IST

అన్నం తిన్న తర్వాత స్నానం చేయకూడదంటారు. స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలంటారు. అలా చేయకపోతే పెద్దలు తిట్టడమో.. లేదంటే కోప్పడటమో చేస్తారు. కారణం చెప్పకుండానే ఇలా పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు

అన్నం తిన్న తర్వాత స్నానం చేయొద్దని పెద్దలు ఎందుకంటారు..? అలా చేస్తే ఏమవుతుంది..?

అన్నం తిన్న తర్వాత స్నానం చేయకూడదంటారు. స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలంటారు. అలా చేయకపోతే పెద్దలు తిట్టడమో.. లేదంటే కోప్పడటమో చేస్తారు. కారణం చెప్పకుండానే ఇలా పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు భోజనం చేసిన తర్వాత స్నానం ఎందుకు చేయకూడదు..? చేస్తే ఏం జరుగుతుంది.? ఇది భయపెట్టడమా? మరేదైనా కారణం ఉందా? ఆరోగ్యానికి ఏమైనా హానికరమా..? దీంట్లో ఉన్న మర్మమేంటో తెలుసుకుందాం?


చాలా మంది ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాతే స్నానం చేస్తారు. మరి కొంత మంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు. ఒక విషయం ఏంటంటే ఉదయాన్ని అల్పాహారం తీసుకుంటే శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. అలా చేయకపోతే అనారోగ్యం కూడా దరిచేరుతుందని వైద్యులు హెచ్చరిస్తారు. అంతేకాకుండా టిఫిన్ చేసిన వారు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఉత్సాహకంగా కూడా ఉంటారని చెబుతారు. దీంతో చాలా మంది టిఫిన్ చేసిన తర్వాతనే స్నానం చేస్తారు. అలా చేయడం మంచిదా? కాదా? అన్న అనుమానం వెంటాడుతుంటుంది. అసలు తిన్న తర్వాత స్నానం చేస్తే ఏమవుతుందన్న ప్రశ్నలు కూడా చాలా మంది మదిలో మొదలవుతుంటాయి. అసలెందుకు తిన్న తర్వాత స్నానం చేయకూడదో తెలుసుకుందాం.


తిన్న తర్వాత స్నానం చేయడం కరెక్ట్ కాదని పెద్దలు వాదిస్తారు. తిన్న తర్వాత స్నానం చేస్తే దరిద్రం వస్తుందని పెద్దోళ్లు చిందులేస్తారు. అసలు ఇందులో ఉన్న నిజమెంతో తెలియాలి. అన్నం తిన్న తర్వాత ఏ పనులూ చేయకూడదని వాదించే వాళ్లుంటే.. ఇంకొంతమంది అన్నం తిన్న తర్వాత స్నానం చేస్తే మహా దోషమని భయపెట్టిస్తూ ఉంటారు. మరికొంత మంది తిన్నాక స్నానం చేస్తే జీర్ణ ప్రక్రియ మందగిస్తుందని.. మలబద్ధకాన్ని కొని తెచ్చుకున్న వాళ్లం అవుతామని చెప్పుకొస్తారు. అసలు ఈ మాటల వెనుక ఉన్న నిజమెంతో పరిశీలిద్దాం.


భోజనం చేసిన తర్వాత స్నానం చేయొద్దని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే.. తిన్న భోజనం జీర్ణం అవ్వడానికి ముందుగా అది జీర్ణకోశానికి వెళ్లాలి. అక్కడ నుంచి పొట్ట, ప్రేగుల్లోకి వెళ్తుంది. దీని వలన పొట్టలో ఆహారం పెట్టుకుని స్నానం చేస్తే.. ఆ నీళ్ల వల్ల శరీరం తడుస్తుంది. దేహం తడవడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరం వేడి అయ్యే సమయంలో సడన్‌గా శరీరం చల్లబడటంతో జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. జీర్ణాశయం పని నెమ్మదించడం వల్ల శరీరంలో గ్యాస్ ఫామ్ అవుతుంది. అంతేకాకుండా ఆహారం పొట్టలో ఉండటం వల్ల ఆయాసం రావడం, నీరసంగా ఉండడం జరుగుతుంది. అదే కాకుండా పొట్టలోనే ఆహారం ఉంటే ఏ పని కూడా చేయలేం. అందువల్లే తిన్నాక 2, 3 గంటలు ఆగిన తర్వాతే స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి స్నానం చేసిన తర్వాత కొన్ని గంటలు గ్యాప్ ఇచ్చాకే స్నానం చేయడం గానీ.. ఏవైనా పనులు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Updated Date - 2021-12-16T23:11:19+05:30 IST