జొమాటో ఐపీఓ శంకర్ శర్మ ఎందుకు పట్టించుకోలేదంటే ?

ABN , First Publish Date - 2021-07-23T01:48:22+05:30 IST

జొమాటో ఐపీఓను... ఫస్ట్ గ్లోబల్‌ సహ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ శంకర్ శర్మ ఎందుకు పట్టించుకోలేదు ?

జొమాటో ఐపీఓ శంకర్ శర్మ ఎందుకు పట్టించుకోలేదంటే ?

హైదరాబాద్ : జొమాటో ఐపీఓను... ఫస్ట్ గ్లోబల్‌ సహ వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ శంకర్ శర్మ ఎందుకు పట్టించుకోలేదు ? మార్కెట్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఇది. రిటైల్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల దృష్టిని తనవైపునకు తిప్పుకునే క్రమంలో సఫలమైన జొమాటో...  శంకర్ శర్మను మాత్తరం తన వైపు ఆకర్షించుకోలేకపోయింది. ‘జొమాటో ఒక కాన్సెప్ట్ స్టాక్, నష్టాన్ని తెచ్చిపెట్టే సంస్థ’ అని శంకర్ శర్మ భావిస్తున్నట్టు వినవస్తోంది. 


ఈ క్రమంలోనే జొమాటో ఐపీఓకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నారో వివరిస్తూ ఓ ఆంగ్ల వెబ్‌సైట్ ఓ కథనాన్ని పోస్ట్ చేసింది. ఆ కథనం ప్రకారం... భారతీయ మార్కెట్ నిజానికి లాభదాయకత విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని, నష్టాలను కలిగించే సంస్థలను నెత్తిన మోసే సంస్కృతి భారతదేశానికి లేదని శర్మ అభిప్రాయపడుతున్నారు.


సాధారణంగా ఓవర్‌హైప్ చేయబడిన ఐపీఓలేవీ సెకండరీ మార్కెట్‌లో పెద్దగా ఫలితాన్నివ్వలేదన్న అభిప్రాయాలున్నాయి. అందుకు ఉదాహరణే బర్గర్ కింగ్. దీని స్టాక్ దాని రికార్డ్ స్థాయి నుంచి 20 శాతానికి పైగా పడిపోయింది. ఇక  గ్లోబల్ మార్కెట్‌ను ఒకసారి పరిశీలిస్తే...  జొమాటోతో సమానమైన సంస్థ గ్రబ్‌హబ్ సత్ఫలితాలనివ్వలేకపోయిందని శర్మ వెల్లడించారు. 

Updated Date - 2021-07-23T01:48:22+05:30 IST