మొట్ట మొదటగా మోదీ ‘‘హనుమాన్ గఢీ’’కే ఎందుకు వెళ్లారంటే...

ABN , First Publish Date - 2020-08-05T22:12:34+05:30 IST

రామ మందిర భూమి పూజ నిమిత్తమై ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకోగానే మొట్ట మొదటగా

మొట్ట మొదటగా మోదీ ‘‘హనుమాన్ గఢీ’’కే ఎందుకు వెళ్లారంటే...

లక్నో : రామ మందిర భూమి పూజ నిమిత్తమై ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకోగానే మొట్ట మొదటగా ‘హనుమాన్ గఢీ’ ఆలయాన్నే సందర్శించుకొని.. తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొట్ట మొదట హనుమాన్ గఢీ ఆలయాన్నే మోదీ ఎందుకు సందర్శించారంటే...


‘‘మొట్ట మొదటగా హనుమాన్ గఢీ ఆలయాన్ని మోదీ సందర్శించడం వెనుక ఓ ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు రాముడికి గొప్ప భక్తుడు. అంతటి గొప్ప భక్తుడి ఆశీర్వాదం లేకుండా ఏ పనీ పూర్తి కాదని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే మొట్ట మొదటగా మోదీ ఈ ఆలయాన్ని సందర్శించారు. రావణుడ్ని సంహరించిన తర్వాత రాముడు అయోధ్యకు చేరుకున్నాడు. అప్పుడు ఈ స్థలంలో నివసించమని హనుమంతుడ్ని రాముడు ఆదేశించారు. అందుకే దీన్ని ’హనుమాన్ గఢీ అని పిలుస్తారు’’ అని ఆలయ ప్రధాన పూజారి రాజుదాస్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-05T22:12:34+05:30 IST