బస్సు సర్వీసులపై సాగదీత ఎందుకు..?

ABN , First Publish Date - 2020-10-28T19:30:27+05:30 IST

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ..

బస్సు సర్వీసులపై సాగదీత ఎందుకు..?

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్ఠంభన కొనసాగడానికి కారణమేంటి? అధికారుల పంతం ఎందుకు? రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రం ఎన్ని కిలోమీటర్లు బస్సులు నడపాలన్నదే తెలుగు రాష్ట్రాల అధికారులకు గుర్తుకు రాలేదు. కానీ కరోనా తర్వాత ఏపీ ఎక్కువ కి.మీ. ఆర్టీసీ బస్సులు నడపడంవల్ల తాము నష్టపోతున్నామనే విషయం తెలంగాణ ఆర్టీసీకి తెలిసింది. దీంతో కి.మీ. తగ్గించుకుంటేనే బస్సులు నడిపేందుకు అనుమతి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం పట్టుపట్టింది. అయితే లక్ష కి.మీ. తగ్గించుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ చెప్పింది. అయితే దీనిపై మరికొన్ని ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావడంతో వీటిపై ఇప్పటికీ ప్రతిష్టంభన వీడటంలేదు. ఏకంగా ప్రభుత్వాధినేతలు జోక్యం చేసుకున్నా.. ఈ సమస్యకు ముగింపుపలకలేకపోయారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలో వారికి చిత్తశుద్ధి లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.

Updated Date - 2020-10-28T19:30:27+05:30 IST