ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఎందుకు ఆపరు..?

ABN , First Publish Date - 2022-08-12T05:12:10+05:30 IST

వాల్మీకిపురం రైల్వే స్టేషన్‌ గత కొద్ది సంవత్సరాల క్రితం ఆధునీకీకరణ చేసి నూతన భవనాలను అందు బాటులోకి తెచ్చినా ఎక్స్‌ప్రె స్‌ రెళ్లను ఎందుకు ఆపరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఎందుకు ఆపరు..?
వాల్మీకిపురం మీదుగా వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు

వాల్మీకిపురం, ఆగస్టు 11: వాల్మీకిపురం రైల్వే స్టేషన్‌ గత కొద్ది సంవత్సరాల క్రితం ఆధునీకీకరణ చేసి నూతన భవనాలను అందు బాటులోకి తెచ్చినా ఎక్స్‌ప్రె స్‌ రెళ్లను ఎందుకు ఆపరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  గ త కొవిడ్‌ కాలం దాకా కూడా ఇదే స్టేషన్‌ గుండా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల స్టాపింగ్‌ ఉండేవని..అది కాస్తా లాక్‌ డౌన్‌ పుణ్యమా అని నిలిపి తిరిగి ఇక్కడ స్టాపింగ్‌ లేకుండా చేయడం బాధాకరమ న్నారు. ప్రస్తుతం వాల్మీకిపురంలో కేవలం ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే నిలుస్తుండటం..దూర ప్రయాణాలు చేసే ప్రజలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపకపోవడంతో త్రీవ  ఇబ్బందులకు గురవతు న్నారు. ఒకవేళ హైదారాబాద్‌, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చే ప్రయాణికులు సమీపంలోని 8కిలోమీటర్ల దూరం లో ఉన్న మదనపల్లె  రైల్వే స్టేషన్‌కు వెళ్లక తప్పడంలేదు. వాల్మీ కిపురం, నిమ్మనపల్లె, గుర్రంకొండ, కలకడ, తదితర ప్రాంతాల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉండే వాల్మీకిపురం రైల్వే స్టేషన్‌ లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపకపోవడం పట్ల ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ద్వారా పలు మార్లు రెల్వే ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకెళ్లారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వాల్మీకిపురం లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు స్టాపింగ్‌ ఏర్పాటు అయ్యేలా చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-12T05:12:10+05:30 IST