న్యాయవాదులు నల్లకోటునే ఎందుకు ధరిస్తారు? చరిత్ర ఏం చెబుతోంది? నలుపు రంగు దేనికి సంకేతమో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-26T16:04:41+05:30 IST

కోర్టు లోపల లాయర్లు..

న్యాయవాదులు నల్లకోటునే ఎందుకు ధరిస్తారు? చరిత్ర ఏం చెబుతోంది? నలుపు రంగు దేనికి సంకేతమో తెలిస్తే..

కోర్టు లోపల లాయర్లు నల్ల కోటు ధరించి తిరుగుతుండటాన్ని మనం చూసేవుంటాం. అదికూడా తెల్ల చొక్కాలపై నల్లకోటు ధరించడాన్ని మనం గమనించేవుంటాం. ఇంతకీ న్యాయవాదులు నల్లకోటు ఎందుకు ధరిస్తారోనని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.  

నల్లకోటు చరిత్ర

న్యాయవాదులు, న్యాయమూర్తులు నల్లకోటు ధరించడం వెనుక సుదీర్ఘ చరిత్ర దాగివుంది. 1327లో ఎడ్వర్డ్- III న్యాయవాద వృత్తిని ప్రారంభించారని చరిత్ర చెబుతోంది. అప్పట్లో లాయర్లకు నిర్థిష్ట వేషం లేకపోయినా, ఈ వృత్తికి ఉన్నత స్థానం కల్పించారు. ఆ తరువాత 1637లో ఒక ప్రతిపాదన వచ్చింది. లాయర్ల కౌన్సిల్‌లో న్యాయవాదులు బ్లాక్ కలర్ డ్రెస్‌ ధరించాలని సూచించారు. అప్పటివరకు న్యాయవాదులకు ఒకే తరహా దుస్తులు ధరించాలనే నియమమేమీ లేదు. 


బ్రిటన్ రాణి మరణంతో..

1694లో బ్రిటన్ రాణి క్వీన్ మేరీ తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఈ నేపధ్యంలో ఆమె భర్త కింగ్ విలియమ్స్.. న్యాయమూర్తులు, న్యాయవాదులంతా నల్ల గౌన్లు ధరించి, కోర్టులో బహిరంగంగా జరిగే సంతాప సభకు హాజరు కావాలని ఆదేశించారు. ఆ తరువాత నుంచి లాయర్లు నల్ల దుస్తులు ధరిచడం ఆనవాయితీగా మారింది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో న్యాయవాదులు కోర్టుల లోపల బ్లాక్ కోటు ధరిస్తారు. 1961 చట్టం ప్రకారం కోర్టులో న్యాయవాదులు నల్ల కోటుతో పాటు తెల్లటి బ్యాండ్ టైని ధరించడం తప్పనిసరి, 

నల్ల దుస్తుల్లో శాస్త్రీయ కోణం

న్యాయవాదులు, న్యాయమూర్తులు నల్ల కోటు ధరించడం వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. నలుపు రంగు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణలకు గుర్తుగా పరిగణిస్తారు. ఈ లక్షణాలు న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిగివుండాలనే ఉద్దేశంలోనే ఈ రంగును ఎంపిక చేశారు. 



Updated Date - 2021-12-26T16:04:41+05:30 IST