అమూల్‌పై విశాఖ డెయిరీ మౌనమెందుకు?

ABN , First Publish Date - 2021-07-25T05:52:31+05:30 IST

అమూల్‌ బల్క్‌ సెంటర్లకు వైసీపీ ప్రభుత్వం సహకరిస్తున్నా విశాఖ డెయిరీ పాలకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని మాజీఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు బుద్దనాగ జగదీశ్వరరావు ప్రశ్నించారు.

అమూల్‌పై విశాఖ డెయిరీ మౌనమెందుకు?
విలేకరులతో మాట్లాడుతున్న బండారు సత్యనారాయణ, బుద్దనాగజగదీశ్వరరావు

టీడీపీ నేతలు బండారు, నాగజగదీశ్వరరావు సూటిప్రశ్న

పాడిరైతులకు అన్యాయం జరిగితే సహించం


దేవరాపల్లి, జూలై 24: అమూల్‌ బల్క్‌ సెంటర్లకు వైసీపీ ప్రభుత్వం సహకరిస్తున్నా విశాఖ డెయిరీ పాలకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని మాజీఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు బుద్దనాగ జగదీశ్వరరావు ప్రశ్నించారు. శనివారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఇంటి వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాడిరైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆడారి తులసీరావు కోర్టుకు వెళ్లకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. విశాఖ డెయిరీని 30 ఏళ్లుగా ఆడారి తులసీరావు సొంత జాగీరుగా వినియోగించుకొని.. కుటుంబసభ్యులు పార్టీ మారితే పాడిరైతులకు అన్యాయం తలపెడతారా అని ప్రశ్నించారు. అమూల్‌ పేరుతో బల్క్‌మిల్క్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తుంటే మిగతా రాష్ట్రాల వారు కోర్టును ఆశ్రయిస్తే తులసీరావు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హెరిటేజ్‌కు చంద్రబాబు ప్రభుత్వం అధికారాన్ని, ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. రూ.2,670 కోట్లు ఉపాధి బిల్లులు ఆగస్టు ఒకటిలోగా చెల్లించకపోతే వంటా-వార్పు కార్యక్రమం చేపట్టి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రోడ్లు దుస్థితి అధ్వానంగా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో గవిరెడ్డి రామానాయుడు, పి.సత్యవతి, బత్తుల తాతయ్యబాబు, పైలా ప్రసాదరావు పోతల రమణమ్మ, పివీజీకుమార్‌ పాల్గొన్నారు.




 


 

Updated Date - 2021-07-25T05:52:31+05:30 IST