జేసీబీ యంత్రాలు, స్కూలు బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?.. కారణం తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-25T16:14:31+05:30 IST

నేటి ఆధునిక ప్రపంచంలో అత్యధికంగా..

జేసీబీ యంత్రాలు, స్కూలు బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?.. కారణం తెలిస్తే..

నేటి ఆధునిక ప్రపంచంలో అత్యధికంగా వినియోగమవుతున్న జేసీబీ యంత్రం మన జీవితాలను ఎంతో సులభతరం చేసింది. గతంలో తవ్వకాల తరహా పనులు చేసేందుకు చాలా రోజులు పట్టేది. అయితే జేసీబీ యంత్రం సాయంతో ఇవే పనులను ఇప్పుడు గంటల వ్యవధిలో పూర్తిచేస్తున్నారు. తవ్వకాల పనులకు జేసీబీ యంత్రం ఎక్కువగా ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. జేసీబీ యంత్రం పసుపు రంగులోనే ఉండటం మీరు చూసే ఉంటారు. అక్కడక్కడా ఈ యంత్రాలు ఎరుపు లేదా గులాబీ రంగులో కనిపించినప్పటికీ, అధికశాతం పసుపు రంగులోనే కనిపిస్తుంటాయి. దీని వెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


గతంలో జేసీబీ మెషీన్లు ఎరుపు, తెలుపు రంగులలో ఉండేవి. అయితే కొన్ని భద్రతా కారణాల వల్ల దానిని రంగు పసుపు రంగులోకి మార్చారు. దీనికి కారణం.. తక్కువ వెలుతురులో ఎరుపు, తెలుపు రంగులు అస్పష్టంగా కనిపిస్తాయి. అయితే తక్కువ కాంతిలో కూడా పసుపు రంగు స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా చీకట్లో జేసీబీ యంత్రంతో తవ్వే పనులు చేపట్టినప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. కేవలం జేసీబీ మెషీన్‌ రంగు మాత్రమే కాదు పాఠశాల బస్సులు కూడా పసుపు రంగులోనే ఉంటాయి. ఎందుకంటే స్కూల్ బస్సులకు, జేసీబీ మెషిన్ తరహా భారీ వాహనాలకు భద్రత ఎంతో ముఖ్యం. ఈ వాహనాలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే వీటికి పసుపు రంగు వేస్తారు. పసుపు రంగు.. దృష్టిని ఆకర్షిస్తుందని కొందరు నమ్ముతారు. ఇది నిజమని కూడా తేలింది. పసుపు రంగు ఇతర రంగుల కంటే ఎక్కువ ఆకర్షణ శక్తి కలిగివుంటుంది. ఎరుపు రంగు కంటే పసుపు రంగు 1.24 రెట్లు మెరుగ్గా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో కనుగొన్నారు. రాత్రి చీకటిలో కూడా పసుపు రంగును సులభంగా గుర్తించవచ్చు. ఇంతేకాకుండా శీతాకాలంలో పొగమంచు కురిసే సమయంలో కూడా ఇతర రంగుల కన్నా పసుపు రంగు త్వరగా కనిపిస్తుంది.

Updated Date - 2021-12-25T16:14:31+05:30 IST