Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాలు, పెరుగుతో అన్నం తప్ప.. వేరేదేమీ తినడం లేదెందుకని..?

ఆంధ్రజ్యోతి (01-06-2020)

ప్రశ్న: మా నాన్నగారికి 77 సంవత్సరాలు. గత మూడు నెలలుగా పాలు, పెరుగుతో అన్నం తప్ప వేరే ఏదీ తీసుకోవడం లేదు. నీరసంగా ఉంటున్నారు. ఆందోళన చెందుతుంటారు.?

- రఘునాథ్‌, కరీంనగర్‌


డాక్టర్ సమాధానం: మీ నాన్నగారు పాలు, పెరుగు తప్ప వేరే ఆహారం తీసుకోకపోతే విటమిన్‌ లోపాలు, రక్తహీనత, మలబద్ధకం తదితర సమస్యలు రావచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఆందోళన అందరికీ సర్వసాధారణమైంది. ఆందోళన తగ్గించేందుకు వ్యాయామం చేయడం, సరైన సమయానికి నిద్ర పోవడం, యోగా, ధ్యానం చేయాలి. కొన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఆవశ్యక ఫాటీ ఆమ్లాలైన ఉ్కఅ, ఈఏఅ లు ఆందోళన తగ్గడానికి అవసరమైన సెరోటోనిన్‌, డోపమైన్‌ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్‌ను నియంత్రిస్తాయి. ఈ ఆవశ్యక ఫాటీ ఆమ్లాలు ఆందోళనను ఎదుర్కోడానికి కూడా మెదడుకు ఉపయోగపడతాయి. ఇటువంటి ఫ్యాటీ ఆమ్లాలు సాల్మన్‌ చేప, మాకరెల్‌ చేప, ఆయిస్టర్స్‌, సముద్రపు రొయ్యలు మొదలైన వాటిలో లభిస్తాయి. వీటిని సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారమేదైనా సరే ఆందోళనను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అన్ని రకాల పండ్లు, ముఖ్యంగా రంగుల్లో ఉండే బొప్పాయి, పుచ్చ, కర్బుజా, మామిడి వంటివి, అన్ని రకాల ఆకుకూరలు, పసుపు, గ్రీన్‌ టీ మొదలైనవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా కలిగి ఉంటాయి. వీటివలన ఆందోళన తగ్గడమే కాక శక్తి  కూడా వస్తుంది. పెరుగు, మజ్జిగ వంటి పులియబెట్టిన పదార్ధాల్లో ఉండే ప్రోబయాటిక్స్‌ అనేవి ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వల్ల మానసిక ఆందోళన తగ్గుతుందని సైన్స్‌ తెలుపుతోంది.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను [email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement