ఎస్కలేటర్‌కు రెండు వైపులా బ్రష్‌లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి పని ఏమిటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-28T17:30:28+05:30 IST

షాపింగ్ మాల్స్‌లో ఉండే ఎస్కలేటర్లను..

ఎస్కలేటర్‌కు రెండు వైపులా బ్రష్‌లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి పని ఏమిటో తెలిస్తే..

షాపింగ్ మాల్స్‌లో ఉండే ఎస్కలేటర్లను మీరు చూసేవుంటారు. ఈ ఎస్కలేటర్‌కు రెండు వైపులా బ్రష్‌లు కనిపిస్తాయి. అవి ఎందుకు ఉపయోగపడతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి ఎవరినైనా అడిగితే అవి ఎస్కలేటర్‌ను శుభ్రపరిచే పని చేస్తాయని సమాధానం ఇస్తారు. కానీ వాటి పని అది కాదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. రీడర్స్ డైజెస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్కలేటర్‌లో కనిపించే పసుపురంగు అంచుకు సమీపంలో ఈ బ్రష్‌లు ఉంటాయి. ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు, మీ పాదాలను ఈ పసుపు రంగు అంచుకు దూరంగా ఉంచండి. ఇక్కడ కనిపించే బ్రష్‌లు చేసే పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్రష్.. ఎస్కలేటర్ పైకి‌ఎక్కే మనిషి ధరించిన దుస్తులు, ఇతర సన్నని వస్తువులు ఎస్కలేటర్‌లో చిక్కుకోకుండా నిరోధిస్తుంది. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎస్కలేటర్‌లో కనిపించే బ్రష్‌లు భద్రతా ఫీచర్‌గా పనిచేస్తాయి. ఈ బ్రష్ ఒక హెచ్చరిక లాంటిది. మీ పాదం పసుపు రంగు గుర్తు సమీపంలోకి రాగానే, ఈ బ్రష్ మీ పాదాన్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెబుతుంది. ఎస్కలేటర్‌పైకి ఎక్కిన చాలా మంది ఈ బ్రష్‌తో తమ షూలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయకూడదు. ఇది ఎస్కలేటర్‌కు నష్టాన్ని కలిగిస్తుంది. మీకు ప్రమాదకరంగా కూడా మారవచ్చు. అందుకే ఎస్కలేటర్‌ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్కలేటర్లపైకి ఎక్కినవారు తమ దుస్తులు ఇరుక్కుపోవడం వల్ల గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అందుకే ఈ సారి ఎస్కలేటర్ ఎక్కినప్పుడు ఈ బ్రష్‌కు దూరంగా ఉండండి.



Updated Date - 2022-02-28T17:30:28+05:30 IST