బాతులు క్యూకట్టి ఎందుకు ఈత కొడతాయో తెలుసా? అప్పుడే పుట్టిన బాతుపిల్ల ఏం చేస్తుందంటే..

ABN , First Publish Date - 2022-01-16T17:18:42+05:30 IST

మీరు ఒక్కసారైనా బాతులు క్యూకట్టి ఈత కొట్టడాన్ని..

బాతులు క్యూకట్టి ఎందుకు ఈత కొడతాయో తెలుసా? అప్పుడే పుట్టిన బాతుపిల్ల ఏం చేస్తుందంటే..

మీరు ఒక్కసారైనా బాతులు క్యూకట్టి ఈత కొట్టడాన్ని చూసే ఉంటారు. పెద్ద బాతు వాటికి ముందుగా ఉంటూ ఈదుతుంది, మిగిలిన బాతులు దానిని అనుసరిస్తాయి. అవి ఇలా ఎందుకు చేస్తాయనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు సాగించారు. డిస్కవరీ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. జర్నల్ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పరిశోధనల్లో దీనికి సమాధానం దొరికింది. తల్లి బాతు వరుసలో ముందుండి ఈదుతుంది. ఆ తర్వాత దాని పిల్లలు వెనుక ఈత కొడుతూ కనిపిస్తాయి.


తల్లి బాతు తన పిల్లల శక్తిని కాపాడేందుకు, వాటికి ఎక్కువ శ్రమ కలుగకుండా ఉండేందుకు ఇలా చేస్తాయని పరిశోధనల్లో తేలింది. బాతులు నీటిలో ఈత కొట్టేటప్పుడు అవి రెక్కలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇందుకోసం ఎక్కువ శక్తిని వినియోగించాల్సివుంటుంది. ఈ పని తల్లి బాతు చేయడం వలన పిల్ల బాతులకు అంత శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. పుట్టిన 15 నిమిషాలకే బాతుపిల్ల ఈత నేర్చుకుంటుంది. తల్లి బాతు ముందు ఈదుతున్నప్పుడు పిల్లబాతుకు ఈత మరింత సులభం అవుతుంది.

Updated Date - 2022-01-16T17:18:42+05:30 IST