వయసుతోపాటు మగవారి కనుబొమలు మందంగా.. ఆడవారి కనుబొమలు పలుచగా ఎందుకు మారుతాయి?

ABN , First Publish Date - 2022-01-09T16:34:26+05:30 IST

వయసుమీద పడిన మగవారి..

వయసుతోపాటు మగవారి కనుబొమలు మందంగా.. ఆడవారి కనుబొమలు పలుచగా ఎందుకు మారుతాయి?

వయసుమీద పడిన మగవారి కనుబొమలు మందంగా మారడాన్ని మనం గమనిచేవుంటాం. అయితే స్త్రీల విషయంలో ఇలా జరగకపోవడాన్ని కూడా చూసేవుంటాం. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంటుంది? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యూలర్ సైన్సెస్‌కు చెందిన పబ్లిక్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం వయసు మీదపడినపురుషుల కనుబొమలు మందంగా తయారు కావడానికి వారిలోని హార్మోనుల స్థాయి పెరగడమేనని కనుగొన్నారు. చికాగో స్కిన్ క్లీనిక్‌కు చెందిన డెర్మటాలజిస్టు డాక్టర్ డెల్ క్యాంపో ఈ విషయమై మాట్లాడుతూ మనిషికి వయసు పెరుతున్నప్పుడు హార్మోన్స్ ప్రభావం హెయిర్ ఫాలికల్స్‌పై పడుతుంది. 




హెయిర్ ఫాలికల్స్ అనేవి జుట్టుకు కింది భాగంలో ఉంటాయి. ఆస్ట్రోజన్ హార్మోన్ అనేది హెయిర్ పెరుగుదలకు తోడ్పడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మనుషులలో ఆస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుంది. అయితే మహిళల్లో మోనోపాజ్ దశ తరువాత ఈ హార్మోన్ విడుదల తగ్గడం ప్రారంభమవుతుంది. డెర్మటాలజిస్టు డాక్టర్ మేరీ ఝిన్ మాట్లాడుతూ జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, పెరగడం అనేవి ఒక దశలో జరుగుతుంటాయి. దీనినే హెయిర్ సైకిల్ అని అంటారు. మనిషిలోని హార్మోనుల స్థాయి దీనిని నిర్ణయిస్తుంది. వయసుతోపాటు పురుషులలో ఆండ్రోజెన్ హార్మోన్ స్థాయి పెరుగుతుండగా, దీనికి భిన్నంగా మహిళలో తగ్గుతుంటుంది. ఇది మనిషి జుట్టు పెరుగుదలను నిర్దేశిస్తుంటుంది. ఈ కారణంగానే వయసు మీదపడుతున్న పురుషులలో కనుబొమలు మందంగా మారుతాయి. మహిళల విషయానికొస్తే వారికి వయసు మీదపడ్డాక కనుబొమలు పలుచగా మారుతాయి.

Updated Date - 2022-01-09T16:34:26+05:30 IST