America లోనే ఎందుకు..? Foreign Education కోసం మనోళ్లు అగ్రరాజ్యానికే క్యూ కట్టడం వెనుక అసలు కారణాలివీ..!

ABN , First Publish Date - 2022-07-20T01:57:57+05:30 IST

పైచదువులకు విదేశాలకు వెళ్లాలనుకునే భారత యువత ముందు ఇప్పుడు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అమెరికాతో పాటూ బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా.. ఇలా అనేక దేశాలు మన కుర్రాళ్లకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. అయితే..

America లోనే ఎందుకు..? Foreign Education కోసం మనోళ్లు అగ్రరాజ్యానికే క్యూ కట్టడం వెనుక అసలు కారణాలివీ..!

ఎన్నారై డెస్క్: పైచదువులకు విదేశాలకు వెళ్లాలనుకునే భారత యువత ముందు ఇప్పుడు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అమెరికాతో పాటూ బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా.. ఇలా అనేక దేశాలు మన యువతకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. అయితే..విదేశీ విద్య అంటే మనోళ్లకు ముందుగా గుర్తొచ్చేది అమెరికానే..! ఈ విషయంలో అమెరికా ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్ అని గణాంకాలు ఎప్పుడో రుజువు చేశాయి. పైచదువుల కోసం అగ్రరాజ్యం చేరుకుంటున్న భారతీయుల సంఖ్య ఇటీవల కాలంలో 12 శాతం మేర పెరిగింది. అసలు అగ్రరాజ్యం పట్ల భారత యువతలో తరగని ఆసక్తికి కారణాలేంటో ఓసారి పరిశీలిస్తే..


1.అనేక ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు అమెరికా నెలవు. ఈ యూనివర్సిటీల పట్టభద్రులకు అవకాశాలకు కొదవే లేదు. కేరీర్‌‌లో దూసుకుపోవచ్చన్న విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. భారత యువత అమెరికా బాట పట్టడానికి ఇదే ప్రధానకారణం! 


2. అమెరికా యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్లకు అమెరికా విశ్వవిద్యాలయాలు అనేక రకాలుగా మద్దతు ఇస్తాయి. కేరిర్ నిర్మాణం ఎలా ఎండాలి, విద్యార్థి దశలో లక్ష్యాలు అందుకునేందుకు ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలి.. ఇత్యాది విషయాల్లో యూనివర్సిటీ అధికారులు స్టూడెంట్లకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు.  


3.వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థులతో అక్కడి క్యాంపస్‌లల్లోని వాతావరణం.. వృత్తిపరమైన కొత్త పరిచయాలు ఏర్పరుచుకునేందుకు, కేరీర్‌లో ఎదిగేందుకు ఏంతో అనుకూలంగా ఉంటుందనేది అమెరికాలో చదువుకున్న వారి అనుభవం. 


4. ఒక సబ్జెక్ట్ ఎంచుకున్న తరువాత అందులోనే చదువు కొనసాగించడమనేది పాత ట్రెండ్. కానీ అమెరికాలో చదువుకునే వారు తమకున్న ఆసక్తిని బట్టి నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. దీన్ని ఇంటర్‌డిసిప్లీనరీ స్టడీ అంటారు. దీని వల్ల విద్యార్థులకు వివిధ అంశాల్లో నైపుణ్యాలు, అనుభవం పెరిగి ఉద్యోగావాకాశాలు మెరుగవుతాయి. 


5.ఇక ప్రతి సబ్జెక్ట్‌లోని సిలబస్‌..ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక అంశాలతో అప్‌డేట్ అవుతూ ఉండటం అమెరికా చదువుల్లోని మరో సానూకూలాంశం. దీని ఫలితంగా.. కంపెనీల అవసరాలకు తగినట్టుగా విద్యార్థులు కొత్త నైపుణ్యాలు సంపాదించగలుగుతారు. 


అమెరికా చదువుల్లో ఇన్ని సానుకూలాంశాలు ఉన్నప్పటికీ.. యూనివర్సిటీల దరఖాస్తు ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతారు. కాబట్టి..పైచదువులకు అమెరికా బాటపట్టాలనుకునే వారు ముందుగా ఎడ్యుకేషన్ కౌన్సిలర్‌ల సలహాలు, సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-07-20T01:57:57+05:30 IST