ఏఆర్‌ పోలీసు కాలనీపై వివక్ష ఎందుకు ?

ABN , First Publish Date - 2021-07-26T05:15:34+05:30 IST

కడప నగరంలోని ఏఆర్‌ పోలీసు కాలనీపై కార్పొరేషన్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకింత వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి మోకాలిలోతు వర్షం నీరు నిలబడి ఉండడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏఆర్‌ పోలీసు కాలనీపై వివక్ష ఎందుకు ?
ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు

ఎటు చూసినా గుంతలే

నిల్వ ఉన్న వర్షపు నీరు 

అధికారులు పట్టించుకోరా ?

కడప(రవీంద్రనగర్‌), జూలై 25: కడప నగరంలోని ఏఆర్‌ పోలీసు కాలనీపై కార్పొరేషన్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకింత వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి మోకాలిలోతు వర్షం నీరు నిలబడి ఉండడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోని రోడ్లు గుంతలమయం కావడంతో ఎక్కడ కిందపడతామోనని ఆందోళన చెందుతు న్నారు. పైగా ఎక్కడ చూసినా ముళ్ల పొదలు, కంపచెట్లు ఉండడంతో ఇళ్లల్లోకి విషపురుగులు వస్తున్నాయని, బయటకు రావా లంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తాము కార్పొరేషన్‌ పరిధిలో ఉన్నామా.. లేదా అని స్థానికులు వాపోతున్నారు. వెంటనే కార్పొరేషన్‌ అధికారులు, ప్రజా ప్రతి నిధులు కలుగజేసుకుని రోడ్లు, కాల్వలు వేయాలని విన్నవించారు. 


17 ఏళ్లుగా ఈ సమస్య ఇలానే ఉంది

2005లో అప్పటి సీఎం చొరవ చూపి మాకు ఈ కాలనీ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మౌలిక వసతులైన రోడ్లు, కాల్వలు లేవు. కరెంటు సమస్య కూడా ఉంది. దీంతో కాలనీవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షం వచ్చిందంటే మోకాటి లోతు నీరు నిలుస్తాయి. అధికారులు వెంటనే ఈ సమస్య పరిష్కరించాలి. 

- అయ్యవారయ్య, ఏఆర్‌ పోలీసు కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు


కాలనీ అంతా కంపచెట్లే

కాలనీలో ఎటు చూసినా పిచ్చిమొక్కలు, కంపచెట్లే. తద్వారా విష పురుగులు ఇళ్లల్లోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలు బయట ఆడుకుం టున్నా మాకు భయంగా ఉంటుంది.  కనీసం ఆరుబయట కూర్చు మన్నా ఏ పురుగో, బుట్టో వస్తుందేమోనని భయమే. దీంతో పాటు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. 

- రవికుమార్‌నాయక్‌, ఏఎ్‌సఐ


వాహనాల్లో వెళ్లాలంటే ఇబ్బంది

కాలనీలో గుంతలు, మిట్టలు ఉండడంతో వాహనాల్లో వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. పిల్లలు, వృద్ధులు వెళ్లాలంటే నానా అవస్థలు పడాల్సిందే. అందునా వర్షం నీరు గుంతల్లో నిలబడి ఏ గుంత ఎక్కడుందో తెలియక ఎంతో మంది కిందపడిన సందర్భాలు ఉన్నాయి. రోడ్లు, కాల్వలు వేసి మా కాలనీని కాపాడాలి.

- అబ్దుల్‌ రెహ్మాన్‌, రిటైర్డ్‌ కానిస్టేబుల్‌



Updated Date - 2021-07-26T05:15:34+05:30 IST