Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 17 Jul 2022 02:04:41 IST

లండన్‌ అందుకే వెళ్లారా?

twitter-iconwatsapp-iconfb-icon

హేశ్‌బాబుకి ఓ అలవాటు ఉంది. ఏమాత్రం గ్యాప్‌ దొరికినా... కుటుంబంతో సహా విదేశాల్లో వాలిపోతారు. అక్కడ కొన్ని రోజులు సేదతీరి తిరిగొస్తారు. ఇప్పుడు కూడా మహేశ్‌ ఫ్యామిలీతో సహా లండన్‌లో ఉన్నారు. ఈమధ్యే లండన్‌ వెళ్లొచ్చిన మహేశ్‌... మళ్లీ ఫ్యామిలీతో సహా ఎందుకు టిరప్‌ వేశారు? అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈసారి మహేశ్‌ లండన్‌ వెళ్లడానికి ఓ కారణం ఉందట. లండన్‌లోని ఓ టాప్‌ కాలేజీలో మహేశ్‌ తనయుడు గౌతమ్‌కి అడ్మిషన్‌ దొరికిందని, అక్కడే గౌతమ్‌ తన విద్యాభ్యాసం పూర్తి చేయబోతున్నాడని సమాచారం. టాలీవుడ్‌లోని ఓ అగ్ర నిర్మాత తనయుడు సైతం అదే కాలేజీలో చదువుతున్నాడట. అక్కడి వాతావరణం బాగుందని మహేశ్‌కు చెప్పడంతో గౌతమ్‌ని కూడా అదే కాలేజీలో జాయిన్‌  చేయాలన్న నిర్ణయానికి వచ్చాడట. అందుకే మరోసారి లండన్‌ వెళ్లాల్సివచ్చింది. మహేశ్‌ కూడా తన కాలేజీ చదువుల్ని విదేశాల్లోనే పూర్తి చేశారు. అమెరికాలో చదవుకొని వచ్చాకే.. ‘రాజకుమారుడు’లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు గౌతమ్‌  విషయంలోనూ అదే జరుగుతుందేమో?

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement