ఎప్పుడు చూసినా కొత్త గడియారంలో 10:10నే ఎందుకు సెట్ చేస్తుంటారు? ఈ రహస్యం తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2022-01-08T12:48:16+05:30 IST

మీరు ఎప్పుడో ఒకప్పుడు వాచ్ షోరూమ్‌కి వెళ్లేవుంటారు.

ఎప్పుడు చూసినా కొత్త గడియారంలో 10:10నే ఎందుకు సెట్ చేస్తుంటారు? ఈ రహస్యం తెలిస్తే షాకవుతారు!

మీరు ఎప్పుడో ఒకప్పుడు వాచ్ షోరూమ్‌కి వెళ్లేవుంటారు. అక్కడ మీరు కొత్త వాచీలను గమనించించప్పుడు దానిలో 10:10 అని సమయం సెట్ చేసివుంటుంది. వాచీ కంపెనీలు ఇలా అదే సమయాన్ని వాచీలలో ఎందుకు సెట్ చేస్తున్నాయో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాచీల షోరూంలలో.. గోడ గడియారం అయినా, టైమ్‌పీస్ లేదా చేతి గడియారం అయినా  10:10 సమయాన్ని చూపిస్తుంది. దీనిని మీరు గమనించేవుంటారు. వాచీ కంపెనీలు టైమును ఇలా చూపించడానికి పలు కారణాలు ఉన్నాయి.


మొదటి కారణం ముల్లుల అమరిక.. గడియారంలో 10 గంటలు దాటి 10 నిమిషాలకు చేరుకున్నప్పుడు.. మూడు ముల్లులు ఒకదానికొకటి కప్పేసివుంచవు. దీనితో పాటు వాచ్‌లో ఉన్న కంపెనీ లోగో, బ్రాండ్ పేరు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రెండవ కారణం గురించి చెప్పుకోవాల్సి వస్తే.. చాలా కంపెనీల గడియారాలలో 3, 6, 9 సంఖ్యల దగ్గర తేదీ లేదా రెండవ డయల్‌ కనిపిస్తుంది. అందువల్ల గడియారంలో 10.10 నిమిషాలు చూపిస్తే.. రెండవ డయల్ అందం ప్రభావితం కాదు. దీని గురించి టైమెక్స్ వాచీ కంపెనీకి చెందిన ఒక  ఉద్యోగి మాట్లాడుతూ.. 10:10 సమయం హ్యాపీ మూడ్‌ని సూచిస్తుందన్నారు. ఈ సమయం గడియారపు అందాన్ని స్పష్టంగా చూపిస్తుందని వాచీ కంపెనీలు భావిస్తుంటాయి. కాగా 10:10 సమయాన్ని సెట్ చేయడం వెనుక కొన్ని అపోహలు, నమ్మకాలు కూడా ఉన్నాయి. అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్- IIలు సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు మరణించారని చెబుతుంటారు. అయితే మీరు చరిత్రను పరిశీలిస్తే అది నిజం కాదని మీకు తెలుస్తుంది. అబ్రహం లింకన్‌పై ఉదయం 10:15 గంటలకు తుపాకీ కాల్పులు జరగగా, మరుసటి రోజు ఉదయం 7.22 గంటలకు మరణించారు. అదే విధంగా మార్టిన్ లూథర్ సాయంత్రం 7.05 నిముషాలకు మరణించారు.

Updated Date - 2022-01-08T12:48:16+05:30 IST