అఫ్ఘాన్ సేనల ఓటమికి కారణం ఇదేనా..?

ABN , First Publish Date - 2021-08-16T01:01:41+05:30 IST

నైతిక స్థైర్యం లోపించడం, అవినీతి కారణంగా అఫ్ఘాన్ సేనుల తాలిబన్లను ఎదుర్కోలేకపోయారని అమెరికా అంచనా వేస్తోంది.

అఫ్ఘాన్ సేనల ఓటమికి కారణం ఇదేనా..?

వాషింగ్టన్: నైతిక స్థైర్యం లోపించడం, అవినీతి కారణంగా అఫ్ఘాన్ సేనలు తాలిబన్లను ఎదుర్కోలేకపోయారని అమెరికా అంచనా వేస్తోంది. అఫ్ఘాన్‌ సర్వతోముఖాభివృద్ధిని పర్యవేక్షిస్తున్న కీలక అమెరికా అధికారి సిద్ధం చేసిన తాజా నివేదిక ప్రకారం.. అఫ్గాన్‌ సేనలు సంఖ్య రికార్డుల్లో కనిపించిన దానికంటే తక్కువని తెలుస్తోంది. సైనిక దస్త్రాల్లో కనిపించిన పేర్లు వాస్తవానికి నకిలీవని, ఆ పేర్లున్న వ్యక్తులెవరూ సైన్యంలో పనిచేయలేదని తెలుస్తోంది. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు కమాండర్లు ఈ విధానంలో తమ జేబులు నింపుకున్నారట.  దీని ఫలితంగా.. సేనల్లో యుద్ధసన్నద్ధత, నైతికస్థైర్యం దెబ్బతిన్నాయి. ఇది వారి పోరాట స్ఫూర్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపించిందని తెలుస్తోంది. మరోవైపు.. తాలిబన్లతో యుద్ధం చేస్తున్న సైనికులకు వ్యవస్థాగత మద్దతు కొరవడిందని..కొన్ని సందర్భాల్లో సమయానికి ఆహారం కూడా అందక వారు ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. 

Updated Date - 2021-08-16T01:01:41+05:30 IST