ఎవరి ధీమా వారిదే

ABN , First Publish Date - 2021-04-19T05:24:22+05:30 IST

రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కీలక ఘట్టం పోలింగ్‌ ముగియడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు ఎవరి లెక్కల్లో వారున్నారు. టీఆర్‌ఎస్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే నిర్వహించగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఆదివారం స్థానిక నేతలతో పోలింగ్‌పై సమీక్ష నిర్వహించారు.

ఎవరి ధీమా వారిదే
నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూం వద్ద పోలీసుల పహారా

‘సాగర్‌’ ఉప ఎన్నిలో 25వేల మెజారిటీ అంటున్న టీఆర్‌ఎస్‌

 వెయ్యి ఓట్లతోనైనా గెలుస్తామంటున్న కాంగ్రెస్‌

13వేలకు పైగా ఓట్ల వస్తాయంటున్న కమలం నేతలు

మాడ్గుపల్లిలో 93.03 అత్యధికం పోలింగ్‌ శాతం

అత్యల్పంగా పెద్దవూరలో 77.55శాతం



(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కీలక ఘట్టం పోలింగ్‌ ముగియడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు ఎవరి లెక్కల్లో వారున్నారు. టీఆర్‌ఎస్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే నిర్వహించగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఆదివారం స్థానిక నేతలతో పోలింగ్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు సంస్థలు చేసిన సర్వే, వ్యక్తిగత పరిశీలన ద్వారా ఓటింగ్‌పై బీజేపీ నేతలు ఒక అంచనాకు వచ్చారు. రికార్డు స్థాయిలో 86.18శాతం పోలింగ్‌ జరగ్గా అత్యధికంగా మాడ్గులపల్లి మండలంలో 93.03శాతం నమోదైంది. అత్యల్పంగా 77.54శాతం పోలింగ్‌ పెద్దవూర మండలంలో నమోదైంది.    


25వేల ఓట్ల మెజారిటీ ధీమాతో టీఆర్‌ఎస్‌

సాగర్‌ ఉప ఎన్నిక ఈనెల 17న జర గ్గా, మొత్తం 2.20.232 ఓట్లకు 1,89, 782 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో 51.47శాతం అంటే 97,680 ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌కు, 38.27 శాతం అంటే 72,629 ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి, 7.13 శాతం అంటే 13,284 ఓట్లు బీజేపీ అభ్యర్థి రవికుమార్‌ నాయక్‌కు, ఇతరులకు 2.83 శాతం అంటే 5,370 ఓట్లు వస్తాయని ఓ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసింది. అయితే మొదటి నుంచి తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో చెబుతున్నట్టే ఎగ్జిట్‌ పోల్‌ వచ్చిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.


సైలెంట్‌ ఓటింగ్‌తో విజయం తమదే అంటున్న కాంగ్రెస్‌

త్రిపురారం మండలలో వెయ్యి, అనుముల మండలంలో 3వేలు, తిరుమలగిరి మండలంలో 500 మెజారిటీ సాధిస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. నిడమనూరు, పెద్దవూర, గుర్రంపోడు ఈ మూడు మండలాలల్లో టీఆర్‌ఎ్‌సకు 3వేలు ఆధిక్యం వస్తుందని, చివరికి తమ అభ్యర్థి కనీసంగా వెయ్యి మెజారిటీతోనైనా బయటపడతారన్న ధీమాలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. ఆదివారం నియోజకవర్గ కీలక నేతలంతా అభ్యర్థి జానారెడ్డితో సమావేశమే పోలింగ్‌పై సమీక్ష నిర్వహించారు.


లక్ష్యాన్ని చేరుకుంటామంటున్న బీజేపీ

నియోజకవర్గానికి వెళ్లేనాటికి అన్ని బూత్‌లకు ఏజెంట్లు లేని పరిస్థితుల నేపథ్యంలో 15వేల ఓట్ల సాధిస్తే మంచి ఫలితం రాబట్టినట్టేనని బీజీపీ భావించింది. అదే లక్ష్యంతో పని ప్రారంభించిం ఆ సంఖ్యకు కొంత అటు ఇటుగా చేరుకుంటామని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు. పోలైన ఓట్లలో ఏడు శాతానికి చేరుకోవాలని అనుకున్నామని, చివరి రోజుల్లో దిగ్గజాలతో చేసిన ప్రచా రం, అభ్యర్థి సామాజికవర్గం, యువతను ఆకర్షించడం ద్వారా లక్ష్యాన్ని చేరడంతోపాటు డి పాజిట్‌ దక్కించుకునేస్థాయికి వచ్చామని బీజేపీ నేతలు అంటున్నారు.


86.18 శాతం పోలింగ్‌ నమోదు

సాగర్‌ ఉప ఎన్నికలో 86.18 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం ఓట్లు 2,20,206 కాగా, 1,89,782 ఓట్లు పోలయ్యాయి. అందులో పురుష ఓటర్ల సంఖ్య 95,344 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 94,438. సాగర్‌, హాలియా మునిసిపాలిటీలతో ఏడు మండలాఆలు ఉండగా, అత్యధికంగా మాడ్గులపల్లి మండలలో 93.05శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ మండలంలో మొత్తం ఓట్లు 7,233 కాగా, 6729 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా పెద్దవూర మండలంలో 77.54శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓట్లు 44,783 కాగా, 34,729 మాత్రమే పోలయ్యాయి. 


సీఎం కేసీఆర్‌ ఆరా

పోలింగ్‌ శనివారం రాత్రి ముగియగానే ఎన్నికలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి పోలింగ్‌ సరళి, మెజారిటీపై ఆరా తీశారు. కొంత మంది 40వేల మెజారిటీ చేరతామని పేర్కొనగా, మరి కొంత మంది 10 నుంచి 15వేలు అంటూ సమాధానమిచ్చినట్లు తెలిసింది. అంకెల్లో తేడాలపై ప్రశ్నించగా తక్కువ మెజారిటీ చెప్పిన ఓ ఎమ్మెల్యే, తాను స్థానికుడినని, ఎన్నో ఎన్నికల్లో ఇక్కడ పనిచేశానని, సాధారణంగా ఇక్కడ గెలిచిన అభ్యర్థికి పదివేలకు మించి మెజారిటీ రెండుమార్లు మాత్రమే వచ్చిందని, అది కూడా పార్టీల వేవ్‌ బాగా ఉన్నప్పుడు మాత్రమే, ఈ నియోజకవర్గ రాజకీయ పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆయన వివరించినట్టు తెలిసింది.



మూడు ఈవీఎంలతో ఓటర్ల తికమక

హాలియా, ఏప్రిల్‌ 18: సాగర్‌ ఉప ఎన్నిక బరి లో 41 మంది అభ్యర్థులు నిలవడంతో మూడు ఈవీఎంలు అనివార్యమయ్యాయి. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలను ఓటు వేయాలని చైతన్యం చేశా రు. ఈ క్రమంలో ఇంటింటికీ తిరిగి తొలి ఈవీఎం నమూనా చూపించి కాంగ్రెస్‌ సీరియల్‌ నెంబర్‌ 2, టీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 4 అని ప్రజలకు పదేపదే వివరించారు. అయి తే అధికారులు ఈవీఎంలను ఎడమ నుంచి కుడికి సీరియల్‌గా ఏర్పాటు చేశారు. దీంతో మొదటి ఈవీఎంలో కాకుండా చివరి ఈవీఎం లో ప్రధాన పార్టీల అభ్యర్థుల నంబర్లు ఉన్నాయి. దీంతో ఓటేసేందుకు వచ్చిన ఓటర్లు మొదటి ఈవీఎంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల సీరియల్‌ నంబర్లు లేకపోవడంతో కొంత తికమకపడ్డారు. కొందరు ఓటర్లు మొదటి ఈవీఎంలోనే ఓటు వేసినట్లు వెళ్లినట్టు తెలిసింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల తలరాత లు మారే అవకా శం ఉంది. అదే సం దర్భంలో గతంకం టే భిన్నంగా ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది.


భారీగా పోలింగ్‌ నమోదు

హాలియా, ఏప్రిల్‌ 18: కరోనా నేపథ్యంలోనూ సాగర్‌ ఉప ఎన్నికలో భారీగా పోలిం గ్‌ నమోదైంది. ఈ నెల 17న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించగా, వేసవి ఎండలో సైతం ఓటర్లు బారులు తీరి ఓటుహక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా మాడ్గులుపల్లి మండలంలో 93.03శాతం పోలింగ్‌ నమోదైంది. మునిసిపాలిటీల్లో నందికొండ(సాగర్‌)లో 14,222 ఓట్లకు 7902 మంది (55.56శాతం) మాత్రమే ఓటు హక్కును వినియోగించుకు న్నారు. మండలాలు, మునిసిపాలిటీల వారీగా ఓటింగ్‌ ఇలా..


మండలం మొత్తం పోలైన పోలింగ్‌

ఓట్లు ఓట్లు శాతం శాతం

అనుముల 33846 29058 85.85

గుర్రంపోడు 34697 31111 89.66

మాడ్గులపల్లి 7233 6729 93.03

నిడమనూరు 34256 30444 88.87

తిరుమలగిరి(సాగర్‌) 31510 27647 87.74

త్రిపురారం 33881 30064 88.73

పెద్దవూర 44783 34729 77.54

మొత్తం 220206 189782 86.18

మునిసిపాలిటీల వారీగా...

మునిసిపాలిటీ మొత్తం పోలైన పోలింగ్‌

ఓట్లు ఓట్లు శాతం

హాలియా 13224 11221 84.85

నందికొండ 14222 7902 55.56

మొత్తం 27446 19123 69.67

Updated Date - 2021-04-19T05:24:22+05:30 IST