ఎవరి వస్త్రధారణ వారిష్టం

ABN , First Publish Date - 2022-05-24T09:08:15+05:30 IST

వస్త్రధారణ విషయంలో ఎవరి ఇష్టాలు వారివని.. హిజాబ్‌ ధారణకు తాను వ్యతిరేకం కాదని ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప విజేత నిఖత్‌ జరీన్‌ వ్యాఖ్యానించింది.

ఎవరి వస్త్రధారణ వారిష్టం

హిజాబ్‌ ధరించడానికి నేను వ్యతిరేకం కాదు: నిఖన్‌ జరీన్‌


న్యూఢిల్లీ, మే 23: వస్త్రధారణ విషయంలో ఎవరి ఇష్టాలు వారివని.. హిజాబ్‌ ధారణకు తాను వ్యతిరేకం కాదని ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప విజేత నిఖత్‌ జరీన్‌ వ్యాఖ్యానించింది. ఆంగ్ల మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఒకరి వేషధారణ పూర్తిగా వారి ఎంపికకు సంబంధించినది అని పేర్కొంది. ‘‘అది (హిజాబ్‌) వారిష్టం. దానిపై నేనేమీ వ్యాఖ్యానించను. నా అభిప్రాయం నాకు ఉంటుంది. వ్యక్తిగతంగా చేస్తూ నేను హిజాబ్‌ ధారణను ఇష్టపడతాను. నాకెలాంటి అభ్యంతరాలు లేవు. నా కుటుంబానికి కూడా. కాబట్టి నా గురించి ప్రజలేం అనుకుంటున్నారనేదానితో నాకు సంబంధం లేదు’’ అని వివరించింది. 

Updated Date - 2022-05-24T09:08:15+05:30 IST