మందకొడిగా సాగుతున్న టీకా కార్యక్రమం .. డబ్ల్యూహెచ్ఓ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-04-02T00:44:21+05:30 IST

ఐరోపా సమాఖ్యలో టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర విమర్ళలు చేసింది.

మందకొడిగా సాగుతున్న టీకా కార్యక్రమం .. డబ్ల్యూహెచ్ఓ ఆగ్రహం

జెనీవా: ఐరోపా సమాఖ్యలో టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థపై తాజాగా తీవ్ర విమర్ళలు చేసింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇంత నెమ్మదిగా సాగడం అసలేమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీని వల్ల కరనా సంక్షోభం మరింత కాలం పాటు కొనసాగుతుందంటూ ఐరపా దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘జానాభాలో కేవలం 10 శాతం మందికే తొలి టీకా డోసు లభించింది. నాలుగు శాతం మందే పూర్తి డోసులను తీసుకున్నారు అని డబ్ల్యూహెచ్ఓ ఐరోపా శాఖ అధిపతి హాన్స్ క్లాజ్ తెలిపారు. మునుపటితో పోలీస్తే ప్రస్తుతం ఐరోపాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. టీకా ఉత్పత్తిని మరింత వేగవంతం చేసి..టీకా కార్యక్రమానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించాలని ఆయన సూచించారు. ప్రస్తుత ఐరోపాలో ఉన్న ప్రతి టీకా వయల్‌ను వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. టీకా కార్యక్రమంలో అమెరికా బ్రిటన్‌ల కంటే ఐరోపా బాగా వెనకబడిన విషయం తెలిసిందే. టీకాల కోసం ఆర్డర్లు పెట్టడంతో పాటూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడంలో ఐరోపా దేశాలు ఆలస్యం చేసాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2021-04-02T00:44:21+05:30 IST