Monkeypox పై WHO ఎమర్జెన్సీ మీటింగ్.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-06-15T02:42:53+05:30 IST

అంతకంతకూ వ్యాపిస్తున్న మంకీపాక్స్(monkeypox)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన చెందుతోంది. అంతర్జాతీయ ప్రజానీకానికి హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించే అంశంపై

Monkeypox పై  WHO ఎమర్జెన్సీ మీటింగ్.. కారణం ఇదే..

జెనీవా : ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ వ్యాపిస్తున్న మంకీపాక్స్(monkeypox) వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన చెందుతోంది. అంతర్జాతీయ ప్రజానీకానికి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించే అంశంపై చర్చించేందుకు జూన్ 23న అత్యవసర భేటీని నిర్వహిస్తున్నట్టు మంగళవారం వెల్లడించింది. మంకీపాక్స్ వ్యాప్తి అసాధారణంగా ఉండడం కలవరానికి గురిచేస్తోందని పేర్కొంది. ఈ కారణంగానే అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథానామ్ తెలిపారు. కాగా మంకీ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది.


మంకీపాక్స్ ఇప్పటివరకు 29 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 1000కిపైగా కేసులు నమోదయ్యాయి. అయిీతే ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

Updated Date - 2022-06-15T02:42:53+05:30 IST