బెల్ట్‌ తీసేదెవరు?

ABN , First Publish Date - 2022-05-26T07:05:31+05:30 IST

మద్యం వ్యాపారుల బెల్ట్‌ దందాకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. లైసెన్స్‌ షాపుల్లో దొరకని మద్యం స్టాక్‌, బెల్ల్‌ షాపుల్లో దొరుకడం గమనార్హం. అంటే బెల్ట్‌ దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. లైసెన్స్‌ షాపుల నిర్వాహకులే బెల్ట్‌షాపులకు వాహనాల నిండా స్టాక్‌ పంపిస్తున్నారు.

బెల్ట్‌ తీసేదెవరు?
మెండోరలో వైన్స్‌ పక్కనే గల ఓ బెల్ట్‌షాప్‌

గ్రామాల్లో మద్యం వ్యాపారుల అక్రమ దందా

ఇష్టారాజ్యంగా అమ్మకాలు

లైసెన్స్‌ షాపుల్లో దొరకని మందు స్థానిక బెల్ట్‌షాపుల్లో లభ్యం

చూసీచూడనట్లుగా అధికారుల తీరు

మెండోర, మే 25: మద్యం వ్యాపారుల బెల్ట్‌ దందాకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. లైసెన్స్‌ షాపుల్లో దొరకని మద్యం స్టాక్‌, బెల్ల్‌ షాపుల్లో దొరుకడం గమనార్హం. అంటే బెల్ట్‌ దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. లైసెన్స్‌ షాపుల నిర్వాహకులే బెల్ట్‌షాపులకు వాహనాల నిండా స్టాక్‌ పంపిస్తున్నారు. అధిక లాభాల కోసం ఈ దందా నడిపిస్తున్నారు. మద్యం దుకాణాల్లో అమ్మకం బెల్ట్‌ షాపులకు విక్రయించడం ద్వారా అధిక ధరలతో లాభాలు గడిస్తున్నారు. దీంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ తతంగం అంతా సంబంధిత అధికారులకు తెలిసినప్పట్టికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తు న్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయమై దృష్టి సారించి బెల్ట్‌ షాపులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అడ్డూ, అదుపు లేకుండా దందా

మండలంలో మద్యం వ్యాపారుల అక్రమ బెల్ట్‌ దందాకు అడ్డూ, అదుపు లేకుండా పోతుంది. అత్యధిక జనాభా కూలి పనులు చేసుకుంటూ జీవనం గడిపే వారు తాగే ముందు బెల్ల్‌షాపుల్లో దొరుకుతుందడడంతో వారు బెల్ట్‌ షాపులను ఆశ్రయిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ఎమ్మార్పీ కంటే అధికంగా చెల్లిస్తున్నారు. ఈ తతంగం అంత తెలిసినా.. తెలియనట్టు సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. మండలంలోని మొత్తం 11 గ్రామాలు ఉండగా.. దూదిగాం, మెండోర గ్రామాలలో లైసెన్స్‌షాపులు ఉన్నాయి. మిగతా 20 బెల్ట్‌షాపులు ఉన్నాయంటే మద్యం అక్రమ దందా ఎలా నడిపిస్తున్నారో? దీన్నే బట్టి తెలుస్తుంది. మండలంలో మండలానికి చివరి గ్రామమైన గ్రామంలో బెల్ట్‌ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మండల కేంద్రంలో ఉన్న మద్యంషాపు అతను ముఖ్యపాత్ర పోషిస్తూ నిత్యం లైసెన్స్‌ షాపు నుంచి మద్యం తరలిస్తూ విచ్చలవిడిగా విక్రయిస్తు న్నారు. ఆ గ్రామాలలో నెలకు అక్షరాల రూ.65 వేలు గ్రామానికి చెల్లించి బెల్ట్‌షాప్‌ నిర్వహిస్తున్నారు. అంతే మద్యం ప్రియుల జేబులకు ఎంత చిల్లులు వేస్తున్నారో దీన్నే బట్టి తెలుస్తుంది. మండల కేంద్రంలో లైసెన్స్‌ షాపు ఉన్న కానీ వేకువజామున ఐదు గంటల నుంచి లైసెన్స్‌షాప్‌ యజ మాని అండతో బెల్ట్‌సాప్‌ నిర్వహిస్తున్నాడు. ఉన్నతాధికారుల కుత వేటు దూరంలో ఇంత జరిగిన చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారు.

కట్టడి చేయని అబ్కారీ శాఖ

మండలంలో ఇంత పెద్దతతంగం నడుస్తున్నా కానీ అబ్కారీ శాఖ ఎందుకు స్పందించడం లేదంటున్నారు. గుడుంబా విక్రయిస్తే నిమిషాల్లో వాటి వాళ్ల దగ్గర ఉన్న గుడుంబానీ స్వాధీనం చేసుకొని వారి మీద కేసులు నమోదు చేసే అధికారులు.. గ్రామాల్లో ఇంత పెద్ద మొత్తం మద్యం అక్రమ దందా నడుపుతున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బెల్ట్‌షాపుల నిర్వాహకులు విందు ఏర్పాటు చేసుకొని అక్కడ అందరం ఒకటే ధరకు విక్రయించాలని కట్టడి చేసుకున్నారని ఆ నోట ఈ నోట పడింది. అక్కడ నెలనెలకు సంబంధిత అధికారులకు ఎంత ముట్టలో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తమని ఎవరూ అపరని దీమాతో బెల్ట్‌ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.

తిను బండారాలతో అదనపు ఆదాయం

మద్యం వ్యాపారులు వారి మద్యం షాపుల పక్కన గల తినుబండారాల షాపుల వద్ద నెలకు రూ.20నుంచి 30వేల లీజు పేరుతో అదనపు వసూలు చేస్తున్నారు. అబ్కారి నిబంధనల ప్రకారం మద్యం షాపుల వద్ద ఎలాంటి తినుబండరాలను విక్రయించవద్దని ఆదేశాలు ఉన్నా.. కానీ వాటిని పాటించే వారు లేరు. వాటని అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకునే అధికారులు కరువయ్యారు. మటన్‌, చికెన్‌, చేపలు, గుడ్డు వివిధ రకాల ప్రైలు అధిక ధరలకు విక్రయిస్తున్నా.. అడిగే నాథుడే కరువయ్యారు. ధర ఎంత విక్రయిస్తున్నా.. క్వాలిటీని కూడా పరిశీలించే పరిస్థితి లేదు. పరిస్థితి ఈ విధంగా ఉన్నా.. మద్యం మందుబాబుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటు న్నారని పలువురు అభిప్రాయాపడుతున్నారు. 

 గ్రామాల్లో బెల్ట్‌ షాపులు నడిపితే కఠిన చర్యలు

: స్టివెన్‌సన్‌, ఎక్సైజ్‌ సీఐ, ఆర్మూర్‌

గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. బెల్ట్‌ షాపుల వల్ల అమాయక కూలీలు, మద్యానికి బానిసలుగా మారుతున్నారు. ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గ్రామాల్లో బెల్ట్‌షాపుల నడిపితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తాం.

Updated Date - 2022-05-26T07:05:31+05:30 IST