- మంత్రి పదవులపై డిప్యూటీ సీఎం వైరాగ్యం
గంగాధరనెల్లూరు, అక్టోబరు 22: ప్రస్తుతమున్న మంత్రులు ఎవరు ఉంటారో....ఎవరికి పదవులు పోతాయో తెలియదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు.చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ తాము ప్రమాణస్వీకారం చేసిన రోజే రెండున్నరేళ్ళ తర్వాత, మీరందరూ మంత్రి పదవుల్లో కొనసాగుతారనేది గ్యారంటీ లేదని సీఎం జగన్ తేల్చిచెప్పారన్నారు. యుగపురుషుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర అనేది ఉందంటే అది ఎన్టీ రామారావు ఒక్కరేనన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కమ్మ కుటుంబాలకు ఒరిగిందేమీలేదని, ప్రత్యేకించి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన వైసీపీ ప్రభుత్వ హయాంలోనే లబ్ధి చేకూరిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జ్ఞానేంద్రరెడ్డి, వేల్కూరు బాబురెడ్డి, చిన్నమరెడ్డి, అనిత లోకేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, గుణశేఖర్రెడ్డి, మునిరాజారెడ్డి, దాముశెట్టి, గుణశేఖర్మొదలి, నరసింహులు నాయుడు, బట్టుజంగనపల్లె వెంకటేశులు రెడ్డి, కలవకుంట తేజ, కార్వేటినగరం శంకర్, ఇందిర, హరిబాబు, మోసస్, ఉపేంద్ర పాల్గొన్నారు.