ఉత్తరాఖండ్ సీఎం ఎవరు?

ABN , First Publish Date - 2022-03-20T19:20:58+05:30 IST

ఉత్తరాఖండ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే ముందు సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది.

ఉత్తరాఖండ్ సీఎం ఎవరు?

ఉత్తరాఖండ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే ముందు సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలి అనే అంశంపై ఆ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యవర్గం నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించనుంది. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కు ఆహ్వానం అందింది. ఆయనతోపాటు మరో మాజీ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా త్రివేంద్ర సింగ్ రావత్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఈ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలి అనే అంశంపై చర్చిస్తాం. చాలా మంది సీఎం పదవికి పోటీ పడుతున్నారు. తాజా గెలుపు నా పనితీరుకు నిదర్శనం. అయితే, నన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారో.. లేదో ఇప్పుడే చెప్పలేను. అధిష్టానమే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది’’ అన్నారు. 

Updated Date - 2022-03-20T19:20:58+05:30 IST