శ్రీకృష్ణుడే కాదు.. ఆ మహనీయుడు కూడా గీతోపదేశం చేశారు.. అర్జునునికన్నా ముందు ఈ జ్ఞానం ఎవరికి దక్కిందో తెలుసా?

ABN , First Publish Date - 2021-11-10T14:57:23+05:30 IST

కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న సమయంలో..

శ్రీకృష్ణుడే కాదు.. ఆ మహనీయుడు కూడా గీతోపదేశం చేశారు.. అర్జునునికన్నా ముందు ఈ జ్ఞానం ఎవరికి దక్కిందో తెలుసా?

కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడు.. అర్జునునికి గీతోపదేశం చేశాడనే విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ ఉపదేశాన్ని శ్రీకృష్ణుడు అంతకు ముందు సూర్యదేవునికి చేశాడనే విషయం మీకు తెలుసా?ఇంతేకాదు.. చాలాసార్లు గీతోపదేశాన్ని పలువురు విన్నారు. గీతోపదేశం కారణంగా అర్జునునికన్నా ముందుగా ఎవరు లబ్ధి పొందారు? ఎవరెవరు ఏఏ సందర్భాల్లో గీతాజ్ఞానం అందుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 


మహాభారతగాథను అనుసరించి.. శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేస్తూ.. దీనిని తొలుత సూర్యదేవునికి చేసినట్లు తెలిపాడు. దీంతో అర్జునుడు ఆశ్చర్యపోతూ.. సూర్యుడు ఎన్నోవేల ఏళ్ల క్రితం నుంచి దేవునిగా పూజలందుకుంటున్నాడు. మరి మీరు సూర్యునికి ఉపదేశం చేయడమేమిటని అడిగాడు. దీనికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ.. అర్జునా.. నువ్వు, నేను ఎన్నో జన్మలు ఎత్తాం. నీకు గత జన్మల గురించి తెలియదు. నాకు సమస్తం తెలుసు. గీతాజ్ఞానాన్ని సూర్యుడే ముందు అందుకున్నాడని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. మహాభారత కథను అనుసరించి శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునునికి గీతోపదేశాన్ని చేస్తున్నప్పుడు సంజయుడు(దృతరాష్ట్రుని రథసారధి.. ఇతనికి వేదవ్యాసుడు దివ్యదృష్టిని అందించాడు) ఈ దివ్యదృష్టి కారణంగా సంజయుడు అన్నీ చూడగులుతాడు. ఈ వరం పొందిన సంజయుడు తాను విన్న గీతోపదేశాన్ని దృతరాష్ట్రునికి వినిపించాడు.


వేదవ్యాసుడు మహాభారత రచన సాగించేముందు.. దీనిని లిఖించే భారాన్ని ఎవరికి అప్పగించాలనే సందేహంలో చిక్కుకున్నాడు. దీనిని గుర్తించిన బ్రహ్మ నేరుగా మహర్షి దగ్గరకు వచ్చాడు. అప్పుడు మహర్షి మహాభారతాన్ని రాయగలిగే వ్యక్తి ఈ భూమండలంపై ఎవరు ఉన్నారని అడిగాడు. దీనికి బ్రహ్మ సమాధానిమిస్తూ, ఈ పనిని గణేశునికి అప్పగించాలని చెబుతాడు. దీంతో వేదవ్యాసుడు.. గణేశుణ్ణి ఆహ్వానించి, మహాభారత గ్రంథాన్ని లిఖించే పనిని అప్పగిస్తాడు. ఈ సమయంలో వేదవ్యాసుడు.. గణేశునికి గీతాజ్ఞానాన్ని అందిస్తాడు. గణేశునితో పాటు వేదవ్యాసుడు గీతోపదేశాన్ని తన శిష్యులైన వైశంపాయనుడు, జైమిని తదితరులకు కూడా వినిపించాడు.

Updated Date - 2021-11-10T14:57:23+05:30 IST