14న వూహాన్‌కు డబ్ల్యూహెచ్‌వో బృందం

ABN , First Publish Date - 2021-01-13T14:42:29+05:30 IST

కరోనా పుట్టినిల్లుగా అపఖ్యాతిని మూటకట్టుకున్న చైనాలోని వూహాన్‌ నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల

14న వూహాన్‌కు డబ్ల్యూహెచ్‌వో బృందం

బీజింగ్‌/జెనీవా, జనవరి 12 : కరోనా పుట్టినిల్లుగా అపఖ్యాతిని మూటకట్టుకున్న చైనాలోని వూహాన్‌ నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం జనవరి 14న (గురువారం) పర్యటించనుంది. వూహాన్‌ కేంద్రంగా కరోనా వైరస్‌ పుట్టుక, తొలినాళ్లలో ఇన్ఫెక్షన్‌ వ్యాప్తికి దారితీసిన కారణాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా పది మంది సభ్యులతో కూడిన ఈ బృందం క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించనుంది. ఇప్పటికే చాలా దేశాలు కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించినప్పటికీ.. ఈ ఏడాదిలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాకపోవచ్చని డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు.


కాగా, ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులను కోరుతూ ఆస్ట్రాజెనెకా దరఖాస్తు సమర్పించిందని యూరోపియన్‌ యూనియన్‌ ఔషధ ని యంత్రణ సంస్థ మంగళవారం వెల్లడించింది. 29న జరగనున్న ఈఎంఏ భేటీలో ఆ వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది.

Updated Date - 2021-01-13T14:42:29+05:30 IST