చేతుల పరిశుభ్రత అంతంతమాత్రం!
ABN , First Publish Date - 2020-05-19T05:30:00+05:30 IST
కరోనా సోకకుండా ఉండాలంటే తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఇలా పరిశుభ్రత పాటించడం అందరికీ సాధ్యమేనా? ఆ వెసులుబాటు అందరికీ ఉంటుందా? అనే కోణంలో...
కరోనా సోకకుండా ఉండాలంటే తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఇలా పరిశుభ్రత పాటించడం అందరికీ సాధ్యమేనా? ఆ వెసులుబాటు అందరికీ ఉంటుందా? అనే కోణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ/యునిసెఫ్ నిర్వహించిన ప్రపంచవ్యాప్త సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
- 300కోట్ల మంది ప్రజల ఇళ్లలో నీళ్లు, సబ్బు వాడే వెసులుబాట్లు లేవు.
- 90 కోట్ల మంది పిల్లలకు వారి స్కూళ్లల్లో నీళ్లు, సబ్బులు అందుబాటులో లేవు.
- 36శాతం పాఠశాలల్లో పరిశుభ్రతకు సంబంధించిన సేవలు అందుబాటులో లేవు.
- 40శాతం ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో చేతుల శుభ్రత వెసులుబాట్లు లేవు.
సక్రమంగా చేతుల పరిశుభ్రత పాటించకపోవడం మూలంగా ప్రతి ఏటా సుమారు 3 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. కొవిడ్ వ్యాప్తికి ముందు సంభవించిన ఈ మరణాల్లో అధికశాతం పిల్లలవే!