కశ్మీర్‌ను పాకిస్తాన్ భూభాగంలో చూపించిన డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2022-01-31T21:27:08+05:30 IST

డబ్ల్యూహెచ్ఓ పోర్టల్స్‌లో భారతదేశ సరిహద్దులను తప్పుగా చూపిస్తూ ఉండడం సరియైనది కాదని, దీన్ని వెంటనే సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

కశ్మీర్‌ను పాకిస్తాన్ భూభాగంలో చూపించిన డబ్ల్యూహెచ్ఓ

హైదరాబాద్: డబ్ల్యూహెచ్ఓ పోర్టల్స్‌లో భారతదేశ సరిహద్దులను తప్పుగా చూపిస్తూ ఉండడం సరియైనది కాదని, దీన్ని వెంటనే సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్, కరోనా వైరస్ విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరించారని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో మన దేశ మ్యాప్‌ను మర్చిచూపడం కూడా చర్చనీయాంశమైంది. సక్రమమైన భారతదేశ చిత్రపటాన్ని డబ్ల్యూహెచ్ఓ పోర్టల్స్‌లో పెట్టాలని, తప్పులను సరిదిద్దాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు గత ఏడాది డిసెంబర్ 30, ఈ ఏడాది జనవరి 3, 8 తేదీల్లో భారత ప్రభుత్వం లేఖలు రాసింది. అంతేకాదు ఐక్యరాజ్యసమతి శాశ్వత భారత ప్రతినిధి ఇంద్రమణి పాండే, టెడ్రోస్ అధనామ్ వద్ద ప్రస్తావించారు. 


ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వివిధ పోర్టల్స్‌లో జమ్ముకశ్మీర్, లడాక్ ప్రాంతాలను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకన్నా భిన్నమైన రంగుల్లో చూపించారు. 1963లో చైనాకు పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా ఇచ్చిన 5168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని షెక్స్‌గమ్ వ్యాలీని చైనాలో భాగంగా చూపించారు. 1954లో చైనా ఆక్రమించుకున్న ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని లేత నీలం రంగు గళ్లలో చూపించారు. చైనా భూభాగాన్ని చూపించడానికి ఉపయోగించిన రంగు కూడా ఇదే. సరైన మ్యాపులను వాడే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థతో తదితర వ్యవస్థలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. మ్యాప్‌లను సరిదిద్దే విషయంతో రాజకీయ జోక్యానికి అవకాశం ఉండకూడదని ప్రభుత్వం చెబుతోంది. 

Updated Date - 2022-01-31T21:27:08+05:30 IST