AP News: ఇప్పడు ఎవరిని సస్పెండ్ చెయ్యాలి..డీజీపీనా? ప్రభుత్వాన్నా?: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-08-31T03:27:06+05:30 IST

Amaravathi: ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను ఉద్యోగం నుంచి తొలగించడంపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu) ట్వీట్ చేశారు. న్యాయం కోసం స్పందన కార్యక్రమానికి

AP News: ఇప్పడు ఎవరిని సస్పెండ్ చెయ్యాలి..డీజీపీనా? ప్రభుత్వాన్నా?: చంద్రబాబు

Amaravathi: ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను ఉద్యోగం నుంచి తొలగించడంపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu) ట్వీట్ చేశారు. న్యాయం కోసం స్పందన కార్యక్రమానికి వచ్చిన బాధితురాలిని పావుగా వాడుకుని కానిస్టేబుల్ ప్రకాష్‌ను విధుల నుంచి తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రకాష్ నిందితుడు కాదని స్వయంగా బాధిత మహిళే చెబుతున్నపుడు ఇప్పడు సస్పెండ్ చేయాల్సింది డీజీపీనా? వైసీపీ (YSRCP) ప్రభుత్వాన్నా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బకాయిలపై ప్రశ్నించిన సొంత శాఖ వ్యక్తిపైనే అక్రమ కేసు పెట్టడం పోలీసు శాఖకే మచ్చ అని పేర్కొన్నారు. 


ఎవరీ ప్రకాష్?..

‘‘సేవ్ ఏపీ పోలీస్ అంటూ..ఓ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఇటీవల నిరసనకు దిగడం కలకలం రేపింది. పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ.. ప్రకాష్‌ ఆందోళనకు దిగారు. జూన్ 14న సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా పోలీసుల అమరవీరుల స్తూపం వద్ద ప్రకాశ్ నిరసన తెలిపారు. కొద్ది రోజులకు ప్రకాశ్‌పై అక్రమ కేసులు బనాయించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఓ మహిళను వేధించి ఆమె నుంచి బంగారం, నగదు తీసుకున్నాడని కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే సదరు మహిళ కానిస్టేబుల్ ప్రకాశ్ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని విలేఖరుల ముందు చెప్పింది. 

Updated Date - 2022-08-31T03:27:06+05:30 IST