మళ్లీ కోరలు విప్పుతున్న Corona మహమ్మారి.. ఫిబ్రవరి 1 నాటికి 5లక్షల మరణాలు..

ABN , First Publish Date - 2021-11-06T01:38:40+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచానికి చుక్కలు చూపించింది. వైద్య పరంగా అభివృద్ధి చెందిన దేశాలు.. సైతం తమ దేశ సరిహద్దులను మూసుకునేలా చేసింది. లక్షలాది మంది ని బలిగొన్న ఈ మహమ్మారి.. వ్యాక్సిన్ రాకతో ఇక అంతరించిపోతుందిలే అని చాలా అంతా భా

మళ్లీ కోరలు విప్పుతున్న Corona మహమ్మారి.. ఫిబ్రవరి 1 నాటికి 5లక్షల మరణాలు..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్.. ప్రపంచానికి చుక్కలు చూపించింది. వైద్య పరంగా అభివృద్ధి చెందిన దేశాలు.. సైతం తమ దేశ సరిహద్దులను మూసుకునేలా చేసింది. లక్షలాది మంది ని బలిగొన్న ఈ మహమ్మారి.. వ్యాక్సిన్ రాకతో ఇక అంతరించిపోతుందిలే అని చాలా అంతా భావించారు. కనీసం బలహీనపడుతుందిలే అని ఆశపడ్డారు. కానీ అది అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మరోసారి విజృంభించేందుకు సిద్ధం అయింది. ఈ విషయం యూరప్, సెంట్రల్ ఆసియాల్లోని కొన్ని దేశాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. క్రమంగా ఆయా దేశాల్లో కేసులు పెరగడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సంచలన విషయాలను వెల్లడించారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



సెంట్రల్ ఆసియా, యూరప్‌లోని 53దేశాల్లో అంతకు ముందు వారంతో పోల్చతే గత వారం కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య రెట్టింపు అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆయా దేశాల్లో ఫిబ్రవరి 1 నాటికి 5లక్షల కరోనా మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలుపుతూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో నివసిస్తున్న వారిలో కనీసం 95 శాతం మంది మాస్క్ పెట్టుకోవడం ద్వారా 1,88,000 మందికి ప్రాణాపాయం తప్పుతుందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ రీజనల్ డైరెక్టర్ డా. హన్స్ క్లూగే పేర్కొన్నారు. గత నాలుగు వారాలుగా కరోనా బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న 100 కరోనా కేసులు నమోదైతే అందులో 59 కేసులు యూరప్, సెంట్రల్ ఆసియా దేశాలకు చెందినవే ఉంటున్నాయని వెల్లడించారు. 



భవిష్యత్తులో పరిస్థితులు దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని హెచ్చిరించారు. అంతేకాకుండా కరోనా కట్టడి చర్యలను సడలించడం వల్లే మరోసారి కరోనా తన విశ్వరూపం చూపించడానికి సిద్ధమైందని వెల్లడించారు. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటం కూడా ఓ కారణం అని తెలిపారు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న దేశాల్లో ఆసుపత్రుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా యూరప్, సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో డెల్టా వేరియంట్, ఏవై.4.2, ఏవై.4.3 రకాల కారణంగా పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నట్టు వివరించారు. 




Updated Date - 2021-11-06T01:38:40+05:30 IST