MODI నిర్ణయం... Taapsee నుంచీ Sonu Sood దాకా ... ఎవరెవరు ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2021-11-19T20:16:34+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య తీసుకున్నారు. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అంతే కాదు, బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు. ఇవేవీ దేశంలో చాలా మంది ఊహించినవైతే కావు. ఇక బాలీవుడ్‌లోనూ ఇంత కాలం రైతులకి మద్దతుగా నిలుస్తూ వస్తోన్న పలువురు సెలబ్రిటీస్ ఇప్పుడు తమ స్పందనని సొషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.

MODI నిర్ణయం... Taapsee నుంచీ Sonu Sood దాకా ... ఎవరెవరు ఏమన్నారంటే...

ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య తీసుకున్నారు. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అంతే కాదు, బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు. ఇవేవీ దేశంలో చాలా మంది ఊహించినవైతే కావు. ఇక బాలీవుడ్‌లోనూ ఇంత కాలం రైతులకి మద్దతుగా నిలుస్తూ వస్తోన్న పలువురు సెలబ్రిటీస్ ఇప్పుడు తమ స్పందనని సొషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. 

మొదట్నుంచీ రైతులకి తన మద్దతు తెలిపిన సోనూ సూద్ ‘‘థాంక్యూ నరేంద్ర మోదీ’’ అంటూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అంతే కాదు, శాంతియుత మార్గంలో ఇంత కాలం ఉద్యమించిన రైతులకి కూడా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ‘‘గురు నానక్ జయంతి వేళ సంతోషంగా మీ, మీ ఇళ్లకు చేరుకోండి!’’ అన్నారు. నటి తాప్సీ కూడా వివాదాస్పద చట్టాల రద్దుని సమర్థించింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ స్నాప్‌షాట్‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేసింది. ‘ఆల్సో’ అని ఇంగ్లీషులో తన క్యాప్షన్ మొదలు పెట్టి ‘గురుపూరబ్ శుభాకాంక్షలు’ అంటూ పంజాబీ భాషలో చెప్పుకొచ్చింది... 

మరో బాలీవుడ్ నటి గుల్ పనాగ్ కూడా మోదీ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. అయితే, ఈ నిర్ణయం ఇంత ఆలస్యం అవ్వకుండా ముందే వచ్చి ఉంటే బాగుండేదని ఆమె అంటోంది. రైతుల నిరసనల్ని అణిచివేసేందుకు, తప్పుదోవ పట్టించేందుకు అనే ప్రయత్నాలు జరిగాయని ఆమె గుర్తు చేసింది. శ్రుతీ సేథ్ తన స్పందన తెలియజేస్తూ ‘‘రైతులు పట్టుదలతో తాము అనుకున్నది సాధించా’’రని కొనియాడింది. రిచా చద్దా కూడా, ‘‘మీరు గెలిచారు! మీ విజయం... అందరి విజయం!’’ అంటూ రైతన్నల్ని మెచ్చుకుంది.   

Updated Date - 2021-11-19T20:16:34+05:30 IST