బూస్టర్ డోసుకు రెడీ అవుతున్న అమెరికా.. డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-19T05:41:44+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దీంతో కొన్ని దేశాలు కొవిడ్ టీకా బూస్టర్ డోసును ఇచ్చేందుకు సిద్ధం అయ్యాయి.

బూస్టర్ డోసుకు రెడీ అవుతున్న అమెరికా.. డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దీంతో కొన్ని దేశాలు కొవిడ్ టీకా బూస్టర్ డోసును ఇచ్చేందుకు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బూస్టర్ డోసు అవసరం లేదని తెలిపింది. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ప్రస్తుతం బూస్టర్ డోసు యొక్క అవసరం ప్రస్తుతానికి లేదని వెల్లడించారు. ‘ప్రస్తుతం మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.. కొవిడ్ టీకా బూస్టర్ డోసు అవసరం ప్రస్తుతానికి లేదని మేము నమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యం అమెరికాను డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోనివారిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికన్లకు బూస్టర్ డోసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-08-19T05:41:44+05:30 IST