Jun 9 2021 @ 17:43PM

సమంత కొడుకు పాత్రలో ఎవరు..?

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం'. పాన్ ఇండియన్ సినిమాగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శకుంతల కొడుకు పాత్ర ఉండగా, దీనికి ఎన్టీఆర్‌ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ లేదా అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌లలో ఒకరిని తీసుకునే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నారట. వీరిలో ఎవరు నటించినా, చైల్డ్ ఆర్టిస్టుగా మంచి లాంచింగ్ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు. మరి ఎవరు ఇందులో నటించే అవకాశం పొందుతారో చూడాలి. కాగా దిల్ రాజు సమర్పణలో, గుణ టీం వర్క్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తవగా త్వరలో మళ్ళీ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.