అయినవారు వదిలేశారు...

ABN , First Publish Date - 2021-05-13T05:21:42+05:30 IST

కరోనా మహమ్మారి మనుషులనే కాదు వారిలోని మానవత్వాన్ని కూడా చంపే స్తుంది. కరోనా భయంతో సాటి మనుషులకు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎవరూ మరణిం చినా కొవిడ్‌తోనే అన్న అపోహతో వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. చివరకు అధికారులు వచ్చి దహనసంస్కారాలు పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అయినవారు వదిలేశారు...
మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తున్న రెడ్‌క్రాస్‌ వలంటీర్లు

అధికారులే దిక్కయ్యారు

ఆమదాలవలస రూరల్‌, మే 12: కరోనా మహమ్మారి  మనుషులనే కాదు వారిలోని మానవత్వాన్ని కూడా చంపే స్తుంది. కరోనా భయంతో సాటి మనుషులకు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎవరూ మరణిం చినా కొవిడ్‌తోనే అన్న అపోహతో వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. చివరకు అధికారులు వచ్చి దహనసంస్కారాలు పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఘటనే మండలంలోని బొబ్బిలిపేటలో జరిగింది. గ్రామంలోని గొల్లవీధికి చెందిన అవాల అప్పయ్య (65), అప్పమ్మ దంపతులు. అప్పమ్మ ఆరు నెలల కిందట మృతి చెందింది. దీంతో అప్పయ్య గత కొన్నిరోజులుగా మనోవేదనకు గురై మంగళవారం రాత్రి మృతిచెందాడు. అయితే, కరోనాతో ఆయన మృతి చెందా డని భావించి అంత్యక్రియలు నిర్వహించేందుకు బుధవారం ఉదయం 11గంటల వరకు ఎవరూ ముందుకురాలేదు. సాటి మనుషులుగా మానవత్వం చాటుకోవాల్సిన గ్రామస్థులు మొఖం చాటేశారు. రావాల్సిన అయినవారు అక్కడ ఉన్నాం.. ఇక్కడ ఉన్నామని కాలయాపన చేయడంతో స్థానిక వలంటీర్లు, సచివాలయ సిబ్బంది మండలాధికారులకు సమాచారం అందించారు. దీనిపై ఎంపీడీవో పేడాడ వెంకటరాజు, తహసీల్దార్‌ జి.శ్రీనివాస రావు స్పందించి శ్రీకాకుళం రెడ్‌ క్రాస్‌ సంస్థకు సమాచారం అందించారు. రెడ్‌ క్రాస్‌ వలంటీర్లు గ్రామానికి చేరుకొని వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహాయంతో అప్పన్న మృతదేహన్ని అంబులెన్స్‌లో శ్రీకాకుళం నాగావళి నది తీరానికి తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.   

Updated Date - 2021-05-13T05:21:42+05:30 IST