Abn logo
Jan 26 2021 @ 23:56PM

కరోనా చికిత్స.. కీలక సూచనలు చేసిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: కరోనా పేషెంట్ల చికిత్స చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని నూతన సూచనలు చేసింది. కరోనా నుంచి కొలుకుంటున్న పేషెంట్లు, ఇంటి వద్దే ఉన్న పేషెంట్లు అందరూ పల్స్ ఆక్సిమెట్రీ ఉపయోగించాలని డబ్ల్యూహెచ్‌వో మార్గరెట్ హారిస్ తెలిపారు. అలాగే పేషెంట్లలో ఆక్సిజన్ ప్రవాహంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వైద్యులకు సూచనలు చేసింది. అలాగే శరీరంలో నరాల్లో రక్తం గడ్డ కట్టకుండా యాంటీకోగులెంట్స్ ఉపయోగించాలని చెప్పారు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందివ్వొచ్చని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది.

Advertisement
Advertisement
Advertisement